స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రేమకథ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా, విద్య కొప్పినీడు – ధీరజ్ మొగిలినేని నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ మూవీ, విభిన్న కోణంలో ప్రేమను ఆవిష్కరించింది.
Also Read :Rashmika : “ప్రతి ఒక్కరి జీవితంలో ఒక విజయ్ ఉండాలి” – రష్మిక ఎమోషనల్ స్పీచ్
ఇక సినిమా విజయోత్సవ వేడుకను (Success Meet) బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు నిర్మాత అల్లు అరవింద్‌తో పాటు హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల విజయ్–రష్మికల నిశ్చితార్థం జరిగిందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తలపై ఇప్పటివరకు ఇద్దరూ ఎటువంటి స్పందన ఇవ్వలేదు. ఇదే సమయంలో ఈ ఈవెంట్‌లో ఇద్దరూ ఒకే స్టేజ్‌పై కనిపించడంతో అభిమానుల్లో హై ఎక్సైట్మెంట్ నెలకొంది.
అయితే ఈ వేడుకలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. విజయ్ రష్మిక చేతిని పట్టుకుని ముద్దాడగా, అభిమానులు ఈలలతో హోరెత్తించారు. రష్మిక కూడా సిగ్గుగా చిరునవ్వులు చిందించడంతో అక్కడి వాతావరణం మరింత హోరెత్తిపోయింది. ఈ క్యూట్ మూమెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేస్తూనే, ఇద్దరి కెమిస్ట్రీ మళ్లీ చర్చనీయాంశమవుతోంది. అభిమానులు అయితే “ఇప్పుడు అఫీషియల్ అనుకోవచ్చా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Vijay Devarakonda kissing Rashmika Mandanna’s hand — the cutest moment on the internet today! 🥰💫#VijayDevarakonda #RashmikaMandanna #CutestPair #VijayRashmika #TheGirlFriend #girlfriend #rashmika pic.twitter.com/qq5fE1Ppwv
— 𝐕𝐢𝐠𝐧𝐞𝐬𝐡 🚩 (@vignesh__9) November 12, 2025