Ranveer Singh: కెరీర్ పీక్స్‌లో ఉండగానే షాక్.. ‘ధురంధర్’ హీరోపై బ్యాన్.. అసలు మ్యాటర్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranveer Singh: బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘డాన్ 3’ చుట్టూ నడుస్తున్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ సినిమా నుంచి అకస్మాత్తుగా తప్పుకున్నాడనే కారణంతో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు రణ్వీర్ సింగ్‌పై ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్’ (FWICE) సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయనకు ఇకపై పరిశ్రమకు చెందిన ఎవరూ సహకరించవద్దంటూ ‘నాన్-కోఆపరేషన్’ (Non-cooperation) ఆదేశాలను జారీ చేస్తూ ఇండస్ట్రీ నుంచి నిషేధించింది.
రూ.40 కోట్ల నష్టం.. ఫర్హాన్ అక్తర్ ఫిర్యాదు!
దర్శక నిర్మాత ఫర్హాన్ అక్తర్ – రితేష్ సిధ్వానీల నిర్మాణ సంస్థ ‘ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్’ ‘డాన్ 3’ ప్రాజెక్ట్ కోసం భారీగా ఖర్చు చేసింది. అయితే షూటింగ్ స్టార్ట్ కావడానికి కేవలం మూడు వారాల ముందే రణ్వీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని, దీనివల్ల ప్రీ-ప్రొడక్షన్ రూపంలో తమకు దాదాపు రూ.40 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని నిర్మాతలు గతంలోనే ఆరోపించారు. స్క్రిప్ట్ విషయంలో వచ్చిన విభేదాల వల్లే రణ్వీర్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన FWICE.. రణ్వీర్ సింగ్‌కు వరుసగా మూడు సార్లు నోటీసులు పంపినప్పటికీ ఆయన వైపు నుంచి సరైన స్పందన రాలేదని పేర్కొంది. దీంతో ఇండస్ట్రీలోని ఏ విభాగానికి చెందిన కార్మికులు, సాంకేతిక నిపుణులు ఆయనతో కలిసి పని చేయకూడదని ఫెడరేషన్ చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిట్ తాజాగా స్పష్టం చేశారు.
Also Read
- S Janaki: పెళ్లి.. పిల్లలు.. వేల పాటలు.. ఎస్.జానకి జీవితంలో తెలియని విశేషాలు!
- S Janaki: మన తెలుగు గర్వం ఎస్. జానకి.. గుంటూరు నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన గానకోకిల
- S Janaki: "ప్రశాంతంగా అనంత లోకాలకు వెళ్లిపోయారు.." ఎస్. జానకి మృతిపై మనవరాలు ఎమోషనల్!
- S Janaki : ఎస్. జానకి మృతి.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం
అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ వంటి దిగ్గజాలకు కెరీర్ మైల్‌స్టోన్‌గా నిలిచిన ‘డాన్’ ఫ్రాంచైజీలో మూడో భాగం కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. రణ్వీర్ తప్పుకున్న తర్వాత ఈ రోల్ కోసం హృతిక్ రోషన్‌ను సంప్రదించినట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఆ నటుడి టీమ్ ఆ వార్తలను పూర్తిగా ఖండించింది. ప్రస్తుతం రణ్వీర్ సింగ్‌పై నిషేధం విధించడంతో ఆయన నటిస్తున్న ఇతర ప్రాజెక్టులపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు ‘డాన్ 3’లో హీరోగా ఎవరు నటిస్తారనే సందిగ్ధత ప్రస్తుతం బాలీవుడ్లో నెలకొంది.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!