Bollywood : భారీ ధరకు 25 ఎకరాల భూమి కొనుగోలు చేసిన స్టార్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఒకరైన రణబీర్ కపూర్ తన సంపాదనను దీర్ఘకాలిక ఆస్తుల రూపంలోకి మారుస్తున్నారు. తాజాగా పూణే సమీపంలోని ముల్షీ తాలూకా, పింప్రి గ్రామంలో రణబీర్ సుమారు 25.7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నాలుగు పక్కపక్కనే ఉండే వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ‘CRE Matrix’ ద్వారా వెల్లడైన పత్రాల ప్రకారం, ఈ మొత్తం లావాదేవీ విలువ రూ. 16.42 కోట్లు. ఈ డీల్ కోసం ఆయన ఏకంగా రూ. 82.13 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు సమాచారం.
రణబీర్ కపూర్ ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ ‘రామాయణం‘ చిత్రంలో రాముడి పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం రణబీర్ భారీ రెమ్యునరేషన్ అందుకున్నాడు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, రణబీర్ ఈ భూమి కొనుగోలు కోసం వెచ్చించిన మొత్తం… ఆయన రామాయణ చిత్రానికి అందుకుంటున్న పారితోషికంలో దాదాపు సగం ఉంటుందని అంచనా వేస్తున్నారు. రణబీర్‌కు ముంబై వెలుపల భూములు కొనడం ఇది మొదటిసారేం కాదు. రెండు నెలల క్రితమే రణబీర్ అయోధ్యలోని ‘ది సరయూ’ ప్రాజెక్టులో రూ. 3.31 కోట్లతో ఒక ప్రీమియం ప్లాట్‌ను కొనుగోలు చేశారు. ఇప్పుడు ముల్షీ ప్రాంతం ముంబై-పూణే ప్రజలకు లగ్జరీ ఫామ్‌హౌస్‌లు, సెకండ్ హోమ్స్ నిర్మించుకోవడానికి అత్యంత ఇష్టమైన డెస్టినేషన్‌గా మారింది. 25 ఎకరాల ఈ భారీ స్థలంలో రణబీర్ భవిష్యత్తులో ఒక భారీ ఫామ్‌హౌస్ లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ ప్రారంభించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అమితాబ్ బచ్చన్, కార్తీక్ ఆర్యన్ వంటి అగ్ర తారల సరసన రణబీర్ కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ ‘స్మార్ట్ ఇన్వెస్టర్’ అనిపించుకుంటున్నారు.
Also Read
తాజావార్తలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
-
RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!