NC 25 : నాగచైతన్య 25వ సినిమాపై ఆ పుకార్లు నమ్మొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రతిష్టాత్మక 25వ చిత్రంకి సంబంధించి రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాకు బెదురులంక ఫేమ్ క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నాడని, ఆకాశంలో ఒక తార సినిమాతో వెండితెర ఎంట్రీ ఇస్తున్న సాత్విక వీరవల్లి చైతు సరసన హీరోయిన్ గా నటించబోతుందని సోషల్ మీడియాలో పోస్ట్ లు వచ్చాయి. ఈ వార్తలపై అక్కినేని నాగచైతన్య అధికారిక బృందం స్పందించింది.
ఈ సినిమాపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఉన్న తీవ్రమైన ఆసక్తి, కుతూహలాన్ని తాము అర్థం చేసుకుంటున్నామని అయితే NC25 ప్రాజెక్టుకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ అయినా కేవలం అధికారిక వేదికలు ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, రూమర్లను ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేసింది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఎలాంటి ఆధారాల్లేని వార్తలను, ఊహాగానాలను నమ్మవద్దని, ప్రాజెక్ట్ వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని నాగచైతన్య టీమ్ స్పష్టం చేసింది. నాగ చైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు డైరెక్షన్ లో తెరెక్కుతున్న వృషకర్మ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమా డిసెంబర్ 4న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. చైతు కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా వసున్న వృషకర్మపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. మరి మైల్ స్టోన్ మూవీకి ఎవరు దర్శకత్వం అనేది అఫీషియల్ ప్రకటన వస్తే గాని తెలియదు.
Also Read
తాజావార్తలు
-
NC 25 : నాగచైతన్య 25వ సినిమాపై ఆ పుకార్లు నమ్మొద్దు
-
Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!