Rana Daggubati: ప్రభాస్ అంటే నాకు అసూయ.. నేను కలగన్న ప్రతిదాన్ని అతడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rana Daggubati: టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ తీస్తే.. అందులో ప్రభాస్, రానా పేర్లు టాప్ 10 లో ఉంటాయి. బాహుబలి సినిమా దగ్గరనుంచి వీరిద్దరి మధ్య స్నేహం మొదలయ్యింది. ఇక అప్పటినుంచి రానా .. ప్రభాస్ ను బావా అని పిలవడం అలవాటు అయ్యింది. ఇప్పటివరకు కూడా ఆ స్నేహం కొనసాగుతూనే ఉంది. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్, రానా ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ గా మారారు. కానీ, ప్రభాస్ ఎదిగినంతగా రానా ఎదగలేకపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా పాన్ ఇండియా సినిమాలే ఉన్నాయి. రానా.. స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు కానీ, సినిమాలు మాత్రం చాలా తక్కువ తీస్తున్నాడు. ఒక పక్క నిర్మాతగా.. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పించే సినిమాలను హిట్ అయ్యేలా చూస్తున్నాడు. ఇక తాజాగా రానా .. తన బెస్ట్ ఫ్రెండ్ ప్రభాస్ ను చూసి అసూయ పడ్డట్టు చెప్పుకురావడం హాట్ టాపిక్ గా మారింది. కల్కి సెట్ లో ప్రభాస్ ను చూసి తాను అసూయ పడ్డట్టు రానా ఒక ఇంగ్లిష్ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
Dunki: సలార్ ను తొక్కేయడానికే షారుఖ్ ఈ పని చేస్తున్నాడా.. ?
Also Read
” నేను కల్కి సెట్ కు వెళ్ళినప్పుడు ప్రభాస్ ను చూసి అసూయ పడ్డాన. చిన్నప్పటి నుంచి నా దృష్టిలో విజువల్ ఎఫెక్ట్ సినిమా అంటే స్టార్ వార్స్ మాత్రమే. అలాంటి సినిమాలు చూడడమే నాకు ఇష్టం. నాలానే ఆ జోనర్ ను ఇష్టపడే వ్యక్తి నాగి. అలానే కల్కిని కూడా అలాగే డిజైన్ చేశాడు. చాలా తక్కువ మందికి మాత్రమే ఇలాంటి జోనర్స్ ను ఇష్టపడతారు. ఇక ఒకరోజు నేను ఆ సెట్ కు వెళ్ళినప్పుడు.. ప్రభాస్ ఒక సీన్ చేస్తూ కనిపించాడు. అది చూసి నేను అలా నిలబడిపోయాను. నేను కల కన్న ప్రతిదీ అతడు చేస్తున్నట్లు కనిపించాడు.. లోపల అసూయ తన్నుకొచ్చింది. ప్రభాస్ తో మాట్లాడకుండానే నేను వెనక్కి వచ్చేశాను. ఆ తరువాత అదే విషయాన్ని ప్రభాస్ కు చెప్పాను. నాకు నిజంగా అసూయగా ఉంది..ఎందుకో తెలియదు అంటే ప్రభాస్ .. డ్యూడ్.. నువ్వు అసూయ పడుతున్నావు అంటే.. నేను సరిగ్గా చేస్తున్నాను అని అర్ధం అని అన్నాడు. ఇది పురాణ ఇతిహాసాల నుండి తీసుకొని సైన్స్ ఫిక్షన్ జోడించిన కథ. ఆ చిత్రం గురించి నేను చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. ఇందులో భారీ తారాగణం ఉన్నారు. ఈ చిత్రానికి ప్రతిదీ అందుబాటులో ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
-
Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు…
-
Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్‌లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్‌తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!