‘కాంత’ సినిమాకి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి టీమ్ మొత్తం సెలబ్రేషన్ మూడ్‌లో ఉంది. దుల్కర్ సల్మాన్ హీరోగా, సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ రెట్రో డ్రామా నవంబర్ 14న రిలీజ్ అయ్యి అన్ని సెంటర్స్‌లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రానా దగ్గుబాటి–సముద్రఖని కీలక పాత్రల్లో నటించగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. దుల్కర్ ‘వేఫేర్ ఫిల్మ్స్’ మరియు రానా ‘స్పిరిట్ మీడియా’ కలిసి నిర్మించిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ తో పాటు టెక్నికల్ వాల్యూస్, మ్యూజిక్, పెర్ఫార్మెన్స్ లకు కూడా భారీగా ప్రశంసలు వస్తున్నాయి.
Also Read : Kamini Kaushal: బాలీవుడ్ హీరోయిన్ కన్నుమూత..
ప్రెస్ మీట్ లో రానా మాట్లాడుతూ, “కాంత కి ఆడియన్స్ నుంచి వస్తున్న లవ్ చూసి చాలా హ్యాపీగా ఉంది. దుల్కర్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. విజువల్స్, బిజిఎం, సెట్స్ అన్నీ టాప్ క్లాస్ గా వున్నాయి. మద్రాస్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే స్టోరీ కావడం, ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా థియేటర్‌కి వెళ్లిన మద్రాస్ ఆడియన్స్ ఇంకా ఎక్కువగా కనెక్ట్ అయ్యారు” అని అన్నారు. దుల్కర్‌తో కలిసి పనిచేయడం గురించి రానా, “నాకు కొలాబరేషన్స్ అంటే చాలా ఇష్టం. ఇద్దరం ఆర్ట్ సినిమా అభిమానులు. ఈ సినిమా చేయడం మాకు నిజంగా గర్వంగా ఉంది” అని చెప్పారు. చాలా గ్యాప్ తర్వాత స్క్రీన్ పై కనిపించిన తన పాత్రకి కూడా మంచి అప్లాజ్ వచ్చిందని రానా చెప్పాడు. సెట్స్ గురించి మాట్లాడితే, “అప్పటి వాహిని–ఏవీఎం స్టూడియోస్ స్టైల్‌లను రిఫరెన్స్ తీసుకుని ప్రతి డీటైల్ కూడా కరెక్ట్‌గా రీక్రియేట్ చేశాం. సెల్వ డైరెక్టర్ ప్రతి ఫ్రేమ్‌ని పెయింటింగ్‌లా తీర్చిదిద్దారు” అని రానా అన్నారు. సినిమాలో ఎంజీఆర్, ఎంఆర్ రాజా వంటి స్టార్ల రిఫరెన్సులు రావడంపై, “కథ 50–60ల టైంకి సంబంధించినది కాబట్టి అవి నేచురల్‌గా వచ్చాయి, బయోపిక్ కాదు” అని క్లారిటీ ఇచ్చారు.
భాగ్యశ్రీ బోర్సే మాత్రం తన ఫస్ట్ తమిళ్ ఫిల్మ్‌గా ‘కాంత’ ఉండటం తమకు లైఫ్‌లో ఒక ప్రత్యేకమైన అవకాశం అని.. సెల్వ సర్ సపోర్ట్ తో ప్రతి లైన్ ప్రాక్టీస్ చేశాను. ఆడియన్స్ నా పెర్ఫార్మెన్స్ ని ఇంతగా ప్రేమిస్తారని ఊహించలేదు. ఈ సినిమా కోసం సావిత్రి గారు, శ్రీదేవి గారు చేసిన ఎన్నో సినిమాలు రిఫరెన్స్ గా చూశాను. ఆరు నెలలు చెన్నైలో ఉండి కష్టపడ్డా ఫలితం ఇప్పుడు చూస్తున్నా” అని చెప్పుకొచ్చింది. వరుసగా రెండు వారాల్లో తమ సినిమాలు రిలీజ్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రానా మాత్రం, “నేను రొటీన్ కమర్షియల్ సినిమాలు చేయను. నేను చూడని సినిమా, కొత్తగా అనిపించే కథల్లో ఉండాలని ఎప్పుడూ అనిపిస్తుంది” అని చెప్పారు. మొత్తానికి, ‘కాంత’ టీమ్‌కి ఈ విజయంతో ఎనర్జీ డబుల్ అయింది అనడంలో సందేహం లేదు.