Ramayana Update: ‘రామాయణ’ నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anupam Kher as Jatayu in Ramayana: భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’. నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణలో రాముని పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీపావళి 2026 కానుకగా నవంబరు 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రామాయణ నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. ఈరోజు మరో ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది.
రామాయణ సినిమాలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ‘జటాయువు’ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్లో జటాయువు రూపం ఆకట్టుకుంటోంది. భారీ రెక్కలు విప్పి ఎగురుతున్న జటాయువుతో పాటు వెనుకభాగంలో కనిపిస్తున్న భారీ పక్షి ముఖం పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రామాయణంలో జటాయువుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. సీతాదేవిని రావణుడు అపహరించి తీసుకెళ్తున్న సమయంలో జటాయువు అతడిని అడ్డుకునేందుకు ధైర్యంగా పోరాడుతుంది. విజయం సాధిస్తాననే ఆశతో కాకుండా.. ధర్మం కోసం నిలబడిన వీరుడిగా జటాయువు పాత్ర నిలిచిపోతుంది. తాజాగా విడుదలైన పోస్టర్‌తో ఈ పాత్రను సినిమాలో ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. ‘జటాయువు: ది వింగ్స్ ఆఫ్ ధర్మ’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ పాత్రను పరిచయం చేసింది.
Also Read
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
- Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ రామాయణ ప్రాజెక్టుతో అనుబంధమై ఉంది. భారతీయ ఇతిహాసాన్ని భారీ స్థాయిలో వెండితెరపై ఆవిష్కరించేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. తాజాగా జటాయువు పోస్టర్ విడుదల కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. హిందీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఐమాక్స్‌తో పాటు ఇతర ప్రీమియం ఫార్మాట్లలోనూ ఈ చిత్రాన్ని వీక్షించే అవకాశం ఉంటుందని పోస్టర్ వెల్లడిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ మరో ఎనిమిది రోజుల్లో ప్రారంభం కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
తాజావార్తలు
-
Ramayana Update: ‘రామాయణ’ నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Muhammad Yunus: “నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు”.. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!