Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Selma Blair Flight Incident: హాలీవుడ్ నటి సెల్మా బ్లెయిర్ విమాన ప్రయాణంలో చోటుచేసుకున్న ఘటనతో మరోసారి వార్తల్లో నిలిచారు. లాస్ ఏంజెలెస్ నుంచి న్యూయార్క్‌కు వెళ్తున్న డెల్టా ఎయిర్ లైన్స్ విమానంలో ఆమె వీరంగం సృష్టించారు. విమాన సిబ్బందిని కొట్టడమే కాకుండా కొరికినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె ప్రవర్తన కారణంగా ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్ (విమాన సిబ్బంది)లకు గాయాలైనట్లు సమాచారం. ఆదివారం రాత్రి న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్. కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానం చేరుకున్న తర్వాత పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోంది.
విమానంలో ఓ ప్రయాణికురాలు దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న సమాచారం అందడంతో అధికారులు ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లు గాయపడినట్లు ఫిర్యాదులు అందాయి. అందులో ఒకరిని తదుపరి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం సెల్మా బ్లెయిర్ను కూడా వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై సెల్మా బ్లెయిర్ ప్రతినిధి స్పందిస్తూ.. ఆ సమతంలో ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదని,ఆ అందుకే ఇలా ప్రవర్తించారని తెలిపారు.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
నాడీ సంబంధిత సమస్యలకు వాడే మందులు తీసుకోకపోవడం, విమానంలో తలకు గాయం కావడం వల్ల సెల్మా బ్లెయిర్ అయోమయానికి గురయ్యారని ఆమె న్యాయవాది కోర్టుకు వివరించారు. విరామం లేకుండా పనిచేయడం, అలసట, విమానంలో తలకు తగిలిన గాయం కూడా బ్లెయిర్ పరిస్థితిపై ప్రభావం చూపిందని వివరించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని పేర్కొన్నారు. దీనిపై తదుపరి విచారణ జనవరి 19న జరగనుంది. డెల్టా ఎయిర్ లైన్స్ ఈ ఘటనపై స్పందిస్తూ.. ప్రయాణికులు, విమాన సిబ్బంది భద్రత తమకు అత్యంత ముఖ్యమని తెలిపింది. విమానంలో క్రమశిక్షణకు విరుద్ధంగా లేదా చట్టవిరుద్ధంగా ప్రవర్తించే వారిపై ఎలాంటి సహనం చూపబోమని స్పష్టం చేసింది. విమానం న్యూయార్క్‌కు చేరుకున్న వెంటనే అధికారులు అక్కడికి వచ్చారని ధ్రువీకరించింది.
సెల్మా బ్లెయిర్‌కు విమాన ప్రయాణంలో ఇలాంటి ఘటన ఎదురుకావడం ఇదే మొదటిసారి కాదు. 2016లో మెక్సికోలోని కాంకున్ నుంచి లాస్ ఏంజెలెస్‌కు వెళ్తున్న విమానంలో ఆమె అసాధారణంగా ప్రవర్తించారు. ఆ సమయంలో జరిగిన ఘటనపై ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. మద్యం, మందులు కలిపి తీసుకోవడం వల్ల స్పృహ కోల్పోయి, తన ప్రవర్తనపై నియంత్రణ కోల్పోయానని అప్పట్లో వివరించారు. అది పెద్ద తప్పిదమని, తన ప్రవర్తన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. 2018లో తనకు మల్టిపుల్ స్క్లెరోసిస్ (ఎంఎస్) అనే నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి ఉన్నట్లు వెల్లడించారు. క్రూయల్ ఇంటెన్షన్స్, లీగల్లీ బ్లాండ్, హెల్‌బాయ్ చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.
తాజావార్తలు
-
Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
-
Explainer: విదేశీ పేదోళ్ల ముందు.. మన ధనికులు కూడా వేస్ట్!
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!