Kajal Aggarwal: ‘రామాయణ’ నుంచి కాజల్‌ను తీసేశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kajal Aggarwal: సాధారణంగా భారీ సినిమాల్లో కాసేపు కనిపించే చిన్న పాత్ర దొరికినా చాలు.. పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఎగిరి గంతేస్తారు. తెరపై కనిపించేది కొద్ది నిమిషాలే అయినా, సినిమా ప్రమోషన్లలో మాత్రం తెగ హడావుడి చేస్తుంటారు. కానీ ఇండియన్ సినిమా హిస్టరీలోనే భారీ ప్రాజెక్ట్‌గా వస్తున్న ‘రామాయణ’ విషయంలో మాత్రం పరిస్థితి రివర్స్‌లో కనిపిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్లలో ఎక్కడా చందమామ కాజల్ అగర్వాల్ కనిపించకపోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ లాంటి వాళ్లు నటిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ డియోల్ కూడా నటిస్తున్నారు. ఢిల్లీ నుంచి చెన్నై దాకా టీమ్ చేస్తున్న ఈవెంట్లలో వీళ్లంతా సందడి చేస్తూ తెగ ముచ్చట్లు పెడుతున్నారు. మరోవైపు లారా దత్త ఈవెంట్లకు నేరుగా రాకపోయినా, టీమ్ మాత్రం ఆమె పేరును ప్రస్తావిస్తూనే ఉంది.
కానీ కాజల్ అగర్వాల్ విషయంలో మాత్రం టీమ్ కనీసం ఆమె పేరును కూడా ఎత్తడం లేదు. రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లలో కూడా ఆమె జాడ ఎక్కడా లేదు. నిజానికి ‘రామాయణ’లో తానొక చిన్న రోల్ చేస్తున్నట్లు గతంలో స్వయంగా కాజలే ఓపెన్‌గా చెప్పింది. రావణాసురుడి భార్య మండోదరిగా ఆమె కనిపించబోతోందన్న టాక్ కూడా గట్టిగానే నడిచింది. కానీ తీరా చూస్తే ప్రమోషన్లలో ఆమె ఆనవాలే లేదు. ఆమె చేసిన పాత్ర చాలా చిన్నది కావడం వల్లే ప్రమోషన్లకు రాలేదా? లేకపోతే దాదాపు 3 గంటల 15 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాలో.. లెంగ్త్ ఎక్కువైపోయి ఎడిటింగ్‌లో కాజల్ సీన్లను ఏమైనా లేపేశారా అనే గుసగుసలు మొదలయ్యాయి. టీమ్ నుంచి కూడా ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో అనుమానాలు ఇంకాస్త ఎక్కువవుతున్నాయి. అసలు కాజల్ ఈ సినిమాలో ఉందా లేదా అన్నది తేలాలంటే నవంబర్ 5న సినిమా థియేటర్లలో పడేదాకా ఆగాల్సిందే.
Also Read
తాజావార్తలు
-
Kajal Aggarwal: ‘రామాయణ’ నుంచి కాజల్‌ను తీసేశారా?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Saurav Das: ‘‘ఢిల్లీలో ఉంటున్నట్లు ఆధారాలేవి?’’ CJP నేతకు కోర్టు ఆదేశం
-
Upasana : ఒక ఆడదాని కన్నీళ్లు ఇంకో ఆడదానికి విజయం కాకూడదు.. ఉపాసన సంచలన వ్యాఖ్యలు!
-
Uttam Kumar Reddy : కాళేశ్వరం పునరుద్ధరణకు ఆర్మీ ఇంజనీర్.. బీఆర్ఎస్ తీరుపై మంత్రి ఉత్తమ్ ఫైర్
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!