SS Rajamouli: గ్లోబల్ బాక్సాఫీస్‌పై జక్కన్న కన్ను.. ‘వారణాసి’ వరల్డ్‌వైడ్ థియేట్రికల్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SS Rajamouli: దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి చూపు ఇప్పుడు కేవలం ఇండియాన్ మార్కెట్ మీదే కాదు, ప్రపంచ బాక్సాఫీస్ మీదే పడింది. తన రాబోయే భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి మూలా నేరుగా థియేటర్లలోనే భారీ స్థాయిలో విడుదల చేయాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు. బ్రెజిల్లో జరిగిన ఓ అంతర్జాతీయ సినీ వేదికపై మాట్లాడిన ఆయన, గ్లోబల్ మార్కెట్‌ను కొల్లగొట్టే తన ప్లాన్‌ను ఓపెన్‌గానే బయటపెట్టారు.
‘RRR’ సినిమాతో అంతర్జాతీయంగా సెన్సేషన్ క్రియేట్ చేసినప్పటికీ, విదేశీ ఆడియన్స్ ఆ చిత్రాన్ని ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోనే చూశారని రాజమౌళి గుర్తుచేశారు. అయితే, ఈసారి ‘వారణాసి’తో ఆ పద్ధతిని పూర్తిగా మార్చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇంట్లో కూర్చుని టీవీల్లోనో, చేతిలో ఉండే మొబైల్ స్క్రీన్లలోనో కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు నేరుగా థియేటర్‌కు వచ్చి పెద్ద తెరపైనే తన సినిమా విజువల్స్ అనుభవించాలని జక్కన్న స్పష్టం చేశారు.
Also Read
తనకున్న అతిపెద్ద ఆశయం ‘వారణాసి’ని గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద నేరుగా రంగంలోకి దించడమేనని రాజమౌళి వెల్లడించారు. లాటిన్ అమెరికాలోని బ్రెజిల్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేశాల్లోని అతిపెద్ద థియేటర్ స్క్రీన్లపై ఈ సినిమాను ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఇప్పటి నుంచే భారీ కసరత్తు మొదలుపెట్టారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే, మునుపెన్నడూ లేని విధంగా ఓ భారతీయ సినిమా నేరుగా ప్రపంచ థియేటర్లలో సరికొత్త బాక్సాఫీస్ రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
SS Rajamouli: గ్లోబల్ బాక్సాఫీస్‌పై జక్కన్న కన్ను.. ‘వారణాసి’ వరల్డ్‌వైడ్ థియేట్రికల్ !
-
RGV: ఆ అరెస్ట్‌లతో టైగర్ ష్రాఫ్ కేసు ఆగదు
-
Deepika Padukone: దీపికా పదుకొణే.. బ్యాక్ టు షూట్!
-
Vaibhav Sooryavanshi: న్యూజిలాండ్ గడ్డపై వైభవ్ అరుదైన ఘనత.. సచిన్‌తోపాటు పాక్, బంగ్లా ఆటగాళ్ల రికార్డులు బ్రేక్..
-
Asian Para Games: ఆసియా పారా క్రీడలను ఘనంగా ముగించిన భారత్.. 114 పతకాలతో గత రికార్డులు బద్దలు..
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!