Ramayana Box Office: ‘రామాయణ’ సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే ఇంకా ఎన్ని కోట్లు కావాలి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayana Box Office: భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా తెరకెక్కిన విజువల్ వండర్ ‘రామాయణ’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రిలీజ్‌కు ముందు ఎదురైన తీవ్రమైన ట్రోలింగ్స్‌ను పక్కనపెట్టి, థియేటర్లలో సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. అయితే, సినిమా ఎంత భారీ వసూళ్లు సాధిస్తున్నప్పటికీ.. ఇది సేఫ్ జోన్లోకి ఎప్పుడు వస్తుంది? బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా ఎన్ని వందల కోట్లు రాబట్టాలి అన్న లెక్కలు ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి.
ఓటీటీ, శాటిలైట్, ఆడియో రైట్స్ ద్వారా మేకర్స్‌కు భారీ ఆదాయం సమకూరినప్పటికీ, బడ్జెట్ భారీగా పెరిగిపోవడంతో థియేట్రికల్ మార్కెట్‌పై భారీ ఒత్తిడి పడింది. ప్రపంచవ్యాప్తంగా ‘రామాయణ’ ఫస్ట్ థియేట్రికల్ రైట్స్ ఏకంగా రూ.800 కోట్ల భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఈ మొత్తం థియేట్రికల్ షేర్ వెనక్కి రావాలంటే ప్రపంచవ్యాప్తంగా సినిమా కనీసం రూ.1,700 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సిందేనని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తొలి 5 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.680 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అంటే సినిమా పూర్తిగా సేఫ్ జోన్లోకి చేరి హిట్ స్టేటస్ అందుకోవాలంటే ఇంకా దాదాపు రూ.1,000 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సిన అతిపెద్ద సవాల్ ముందుంది.
Also Read
- Gautam Ghattamaneni: నితీశ్ తివారీ ‘రామాయణ’కు మహేశ్ బాబు కొడుకు దిమ్మతిరిగే రేటింగ్.. గౌతమ్ రివ్యూ వైరల్!
- January 12 Vidudala: సంక్రాంతి రేసులో ముందే దూకుడు.. అమెరికాలో సందడి చేయనున్న ‘జనవరి 12 విడుదల’ టీమ్!
- Poonam Kaur : ముందుంది అసలు సినిమా.. పవన్ విడాకుల వేళ పూనమ్ కౌర్ ట్వీట్ కలకలం!
- Rashmika: రష్మిక క్రేజ్‌కు వరుస బ్రేకులు.. 'మైసా'తో బౌన్స్ బ్యాక్ అవుతుందా?
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్ర థియేట్రికల్ హక్కులను దాదాపు రూ.41 కోట్లకు కొనుగోలు చేశారని చెబుతున్నారు. తొలి 5 రోజుల్లో తెలుగునాట ఈ చిత్రం సుమారు రూ.24 కోట్ల షేర్ (దాదాపు రూ.47 కోట్ల గ్రాస్) సాధించింది. దిల్ రాజు పెట్టిన పెట్టుబడి పూర్తిగా వెనక్కి వచ్చి సేఫ్ అవ్వాలంటే తెలుగులో ఇంకా రూ.17 కోట్ల షేర్ (సుమారు రూ.35 కోట్ల గ్రాస్) రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. పండుగ సెలవులు ముగిసినా వర్కింగ్ డేస్‌లోనూ కలెక్షన్లు డ్రాప్ కాకుండా నిలకడగా కొనసాగుతుండటం బయ్యర్లకు ఊరటనిస్తోంది. రాబోయే రోజుల్లో లాంగ్ రన్ కొనసాగితే ఈ భారీ టార్గెట్‌ను అందుకోవడం ‘రామాయణ’కు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని అంటున్నారు.
తాజావార్తలు
-
Ramayana Box Office: ‘రామాయణ’ సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే ఇంకా ఎన్ని కోట్లు కావాలి?
-
YS Jagan: PPP పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ భారీ స్కాం.. సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్..
-
Kareena Kapoor: కరీనా లాకెట్‌పై ఖురాన్ వచనాలు.. కాంగ్రెస్ నేత లీగల్ నోటీసులు!
-
CM Revanth Reddy: నీళ్ల నివాసాన్ని ఆక్రమిస్తే.. మన నివాసాలనే ఆక్రమిస్తాయి..
-
Gautam Ghattamaneni: నితీశ్ తివారీ ‘రామాయణ’కు మహేశ్ బాబు కొడుకు దిమ్మతిరిగే రేటింగ్.. గౌతమ్ రివ్యూ వైరల్!
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!