ప్రశాంత్ మాడుగుల, ఐశ్వర్య, సుక్కు రెడ్డి, అఖిల్ మున్నా ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘రామచంద్రాపురం’. ఆర్. నరేంద్రనాథ్ దర్శకత్వంలో నిహాన్ కార్తికేయన్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ సినిమా టీజర్ ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు.
Read Also : ముగ్గురు మొనగాళ్లు : “ఓ పిల్లా నీ వల్ల” వీడియో సాంగ్
ఈ సందర్భంగా దర్శకుడు నరేంద్రనాథ్ మాట్లాడుతూ, ”రామచంద్రాపురం గ్రామంలోని రియల్ లొకేషన్స్ లో ఈ సినిమాను చిత్రీకరించాం. వాస్తవానికి దగ్గరగా సినిమా ఉంటుంది. ఇప్పటికే ఇందులోని రెండు పాటలను విడుదల చేయడం జరిగింది. వాటికి చక్కని స్పందన వచ్చింది. నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిహాన్ కార్తికేయన్ కు ధన్యవాదాలు” అని అన్నారు. ఈ యాక్షన్ డ్రామా అందరికీ నచ్చుతుందనే ఆశాభావాన్ని హీరో ప్రశాంత్ మాడుగుల వ్యక్తం చేశారు.