ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ట్రెండుకు భిన్నంగా స్పీడు పెంచారు. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా అనంతరం వరుస ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలకు తోడు తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టుకు రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రామ్ ఇప్పటికే ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా బ్యానర్లో ఒక సినిమా చేసేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే, అయితే, ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే మరో సరికొత్త కథకు రామ్ ఓకే చెప్పారు. విశేషమేమిటంటే, ఈ సినిమాను ఒక కొత్త దర్శకుడు తెరకెక్కించబోతున్నారు. రామ్ ఎంచుకున్న ఈ కొత్త కథ పక్కా మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో సాగనుందని సమాచారం.
Also Read :Tollywood – RSS : టాలీవుడ్ స్టార్ హీరోలతో ఆర్ఎస్ఎస్ చీఫ్ భేటీ.. అసలు కారణం ఇదేనా?
రామ్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా, హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ సినిమా ఉండబోతోంది, కొత్త దర్శకుడు చెప్పిన పాయింట్ రామ్‌కు బాగా నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని నిర్ణయించుకున్నారట. రామ్ ఈసారి కాస్త భిన్నమైన ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నారు. ఆర్కా మీడియా సినిమా కంటే ముందే ఈ కొత్త దర్శకుడి సినిమాను ప్రారంభించనున్నారు.ఈ సినిమా మొదలైన కొద్దిరోజులకే ఆర్కా మీడియా ప్రాజెక్టును కూడా సెట్స్ పైకి తీసుకువెళ్లే ఆలోచనలో ఉన్నారు. అంటే ఒకే సమయంలో ప్యారలల్ షూట్ చేయబోతున్నారు. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్, ఈసారి పక్కాగా స్కెచ్ వేశారు, ఒకవైపు అగ్ర నిర్మాణ సంస్థతో సినిమా చేస్తూనే, మరోవైపు కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ రెండు సినిమాలు రామ్ కెరీర్‌కు మళ్ళీ పూర్వ వైభవాన్ని తెస్తాయని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.