RGV: మళ్ళీ హైకోర్టుకు వర్మ.. ఆ కేసుల్లో కూడా బెయిల్ ఇవ్వండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ హైకోర్టులో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో రెండు పిటిషన్లు దాఖలు చేసినట్టు తెలుస్తోంది. నిజానికి అనకాపల్లి, గుంటూరులో వర్మపై కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో ఈ రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్లు వేశారు రామ్ గోపాల్ వర్మ. ఈ క్రమంలో ఈ రెండు పిటిషన్లు మీద రేపు విచారణ చేపట్టనుంది ఏపీ హైకోర్టు. ఇప్పటికే ప్రకాశం జిల్లా మద్ది పాడు పోలీసులు నమోదు చేసిన కేసులో వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో మొత్తం ఇప్పటి వరకు వర్మపై ఏపీలో 3 కేసులు నమోదు అయినట్టు అయింది.
Vishwak Sen: పాపులర్ సింగర్ ను ‘వాడు’ అనేసి నాలుక కరుచుకున్న విశ్వక్
Also Read
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో వర్మపై కేసు నమోదయింది. అంతేకాక హైదరాబాదు వచ్చిన పోలీసులు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే తనకు ముందుగా నిర్ణయించుకున్న మేరకు షూటింగ్ లు ఉన్నందున తాను నాలుగు రోజుల తర్వాత విచారణకు వచ్చి సహకరిస్తానని వర్మ వాట్సాప్ ద్వారా పోలీసులకి సమాచారం ఇచ్చాడు. ఇక తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశముందని భావించిన రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Argentina vs Switzerland: అల్వారెజ్, మార్టినెజ్ల మాయాజాలం.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన అర్జెంటీనా..
-
Samsung Galaxy Tab S12+: సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ S12+ ఫస్ట్ లుక్.. ఫ్రంట్ డిజైన్ వెల్లడి, త్వరలో లాంచ్?
-
ICC T20 Ranking: 1,605 రోజుల సామ్రాజ్యం కుప్పకూలింది.. నంబర్ 1 ర్యాంక్‌ను కోల్పోయిన భారత్!
-
Nita Ambani: దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీ.. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో తొలి స్థానం
-
The Odyssey: కటింగ్ చాయ్ కోసం ముంబై వీధుల్లో హాలీవుడ్ స్టార్లు.. వైరల్‌గా మారిన వీడియో
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!