సీనియర్ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఛాంపియన్’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని వైజయంతీ మూవీస్ మరియు స్వప్న సినిమా వంటి అగ్ర నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Also Read:Chikiri Chikiri: తెలుగులో 100M+, 5 భాషల్లో 150M+.. షేక్ చేస్తోన్న చికిరి చికిరి
నిజానికి, ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నేడు ఈ సినిమా సెట్‌లో నిర్వహించాలని చిత్ర యూనిట్ మొదట నిర్ణయించుకుంది. అయితే ఔట్ డోర్ ఈవెంట్ కోసం టీమ్ వేరే ఊరికి వెళ్లడంతో, హైదరాబాద్‌లో జరగాల్సిన ప్రెస్ మీట్‌ను చివరి నిమిషంలో వాయిదా వేయక తప్పలేదు. ఈ క్రమంలో, ఈ సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేందుకు మేకర్స్ ఒక భారీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఈవెంట్‌ను డిసెంబర్ 18న ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
Also Read:Akhanda 3: శంబాల నుంచి మొదలు.. అఖండ 3 లీక్ ఇచ్చేసిన బోయపాటి
‘ఛాంపియన్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రామ్ చరణ్ వంటి అగ్ర హీరో ఈ ఈవెంట్‌కు రావడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. వైజయంతీ మూవీస్ వంటి పెద్ద బ్యానర్ నుంచి వస్తున్న రోషన్ రెండవ చిత్రం ‘ఛాంపియన్’. ఈ చిత్రానికి రామ్ చరణ్ మద్దతు లభించడం, రోషన్‌కు మరియు చిత్ర యూనిట్‌కు మరింత బలాన్ని చేకూర్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
