RC 17: చరణ్ ఫాన్స్.. రెడీ అవండమ్మా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. మరో రెండు వారాల్లో మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ చేశాడు రామ్ చరణ్. ఇప్పటికే సుకుమార్ కాంబినేషన్లో #RC17 ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయగా, ప్రస్తుతం సుకుమార్ కథపై కసరత్తులు చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా స్క్రిప్ట్ లాక్ అయినట్టు సమాచారం. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో రామ్ చరణ్ లుక్ అండ్ స్టైల్ ఎలా ఉండాలనే దానిపై సుకుమార్ ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే చరణ్‌తో కలిసి ముంబైలోని ఓ ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్‌ను సుకుమార్ సంప్రదించినట్లు టాక్. చరణ్‌పై ఒక ప్రత్యేక టెస్ట్ షూట్‌ను కూడా నిర్వహించారట.
ఆ అవుట్‌పుట్‌తో సుకుమార్ పూర్తిగా సంతృప్తి చెందారని, చరణ్ లుక్ & స్టైల్‌ను ఫైనలైజ్ చేశారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ‘పెద్ది’ సినిమా విడుదలైన వెంటనే #RC17 సెట్స్ పైకి వెళ్లనుంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. ఈ ఏడాది జూలైలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సుకుమార్ ఇప్పటికే స్క్రిప్ట్ పనులన్నీ పూర్తి చేసి, తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు. కాబట్టి త్వరలోనే సరికొత్త అప్డేట్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చరణ్ – సుకుమార్ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. పైగా ‘పుష్ప 2’ లాంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ తర్వాత సుకుమార్ తెరకెక్కించబోయే చిత్రం కావడంతో, అనౌన్స్మెంట్ నుంచే దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరి ఈసారి రామ్ చరణ్‌తో కలిసి సుకుమార్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి!
Also Read
- Pallaburusu: టూత్‌బ్రష్‌తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
- Dancers Association Rift: 'ఉప ఎన్నికల'కే మొగ్గు చూపిన అధ్యక్షురాలు.. 'పూర్తి ఎన్నికలు' కావాలంటున్న అసమ్మతి వర్గం!
- TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
- Kalyanam Kamaneeyam : రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో రస్టీ లవ్ స్టోరీ టీజర్!
తాజావార్తలు
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
-
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్‌డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
-
Parthiv Patel: హిట్‌మ్యాన్‌ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?