RC17 : రామ్ చరణ్ సినిమాలో నటించేలానుకునే వాళ్ళకి బంపర్ ఆఫర్

Rc 17

Rc 17

RC17 Movie: గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ RC17 కోసం చిత్రబృందం నటీనటుల వేట ప్రారంభించింది. ఈ సినిమాలో నటించాలని అనుకునేవారికి అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తూ మేకర్స్ అధికారికంగా ఆడిషన్స్‌కు పిలుపునిచ్చారు. అన్ని వయసుల వారికి ఈ ఆడిషన్స్‌లో అవకాశం కల్పిస్తున్నట్లు చితబృందం ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేశారు.

కొత్త ప్రపంచం.. సరికొత్త కథ.. అందులో మీకో పాత్ర ఎదురుచూస్తుంది అంటూ క్యాస్టింగ్ ప్రకటనను పంచుకున్నారు. ఈ మూవీలో నటించాలనుకునేవారు తమ ఆడిషన్ వీడియోలను src17casting@gmail.com మెయిల్‌కు పంపించాలని సూచించారు. అలాగే, మరిన్ని వివరాల కోసం 9110564651 వాట్సాప్ నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. ఇక రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇకపోతే, గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ మూవీ బిగ్గెస్ట్ హిట్ అందుకోవడంతో మరోసారి ఈ కాంబోపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం ఎవరికి దక్కుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి, RC17 ఆడిషన్స్ ప్రకటనతో మెగా ఫ్యాన్స్ లోనే కాకుండా నటనపై ఆసక్తి ఉన్న యువతలోనూ ఉత్సాహం మొదలైంది.