RC 17 : కన్ఫ్యూజన్లో పడేసిన సుకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ను పక్కన పెడితే, ‘పెద్ది’ రిలీజ్ వరకు ‘రంగస్థలం’ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అప్పట్లోనే నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేసింది. ఎనిమిదేళ్ల తర్వాత ఆ హిట్ కాంబో రిపీట్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘పుష్ప’తో బన్నీకి పాన్ ఇండియా ఇమేజ్ తీసుకొచ్చాడు సుకుమార్. ‘గేమ్ చేంజర్’, ‘పెద్ది’ హిందీలో రిలీజ్ అయినా హిట్ కాలేదు. సుకుమార్ మూవీతో రామ్ చరణ్ పాన్ ఇండియా హిట్ కొడతాడన్న నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు.
‘పెద్ది’ మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ లో సుకుమార్ మైక్ తీసుకోగానే రామ్ చరణ్ మూవీ గురించి చెప్పాలంటూ అభిమానులు గోల చేశారు. లెక్కల మాస్టారి లెక్కలు ఏమిటో గానీ, చెప్పడానికి నిరాకరించారు. RC 17 గురించి ఇప్పుడు చెప్పడం ఇష్టం లేదని చెప్పడంతో మెగా ఫ్యాన్స్ షాక్ అయ్యారు. RC 17 గురించి సుకుమార్ పెదవి విప్పకపోవడంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
పుష్ప 2 తర్వాత రామ్ చరణ్ తో చాలా కథలు అనుకున్నా ఒక్కటి సెట్ కాలేదు, ఇలాంటి కన్ఫ్యూజన్ లో ఉన్న డైరెక్టర్ ను సినిమా గురించి అడిగితే ఏం చెబుతాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సుకుమార్ తో పెట్టుకుంటే రెండు మూడేళ్ళు ఈజీగా గడిచిపోతాయి. పుష్ప 2 రిలీజ్ అయి ఏడాదిన్నర అయింది, ఇంతవరకు రామ్ చరణ్ మూవీ కథ ఫైనల్ కాలేదు. కథను చెక్కి చెక్కి బౌండెడ్ స్క్రిప్ట్ రాయడానికి ఇంకో నాలుగైదు నెలలు ఈజీగా పట్టేస్తుంది. ఈ లెక్కన దసరా తర్వాతే సినిమా సెట్స్ పైకి వచ్చేది. ఇక మూవీ పూర్తి కావడానికి రెండేళ్ళు ఈజీగా పట్టేస్తుంది. ఈ లెక్కలన్నీ చూసుకుంటే సినిమా 2028 డిసెంబర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!