Peddi : యూఎస్‌కే కాదు.. యూకేలోనూ ‘పెద్ది’ దుమ్మురేపుతోంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (PEDDI). ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్-ఇండియా చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సినిమా ఓవర్సీస్ మార్కెట్లో అప్పుడే సరికొత్త రికార్డుల వేట మొదలుపెట్టింది. తాజా సమాచారం ప్రకారం యూఎస్ఏ (USA) మార్కెట్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా యూకే (UK – యునైటెడ్ కింగ్డమ్) మార్కెట్లో ‘పెద్ది’ అడ్వాన్స్ బుకింగ్స్ సాలిడ్‌గా, చాలా స్టడీగా దూసుకుపోతుండటం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా తర్వాత రామ్ చరణ్‌కు అంతర్జాతీయంగా, ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. దానికి తగ్గట్టుగానే ‘పెద్ది’ సినిమా ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది రోజుల్లోనే భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని మెగా అభిమానులు ఈ సినిమా టికెట్ల కోసం ఎగబడుతుండటంతో అక్కడ ప్రీ-సేల్స్ సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తున్నాయి. సమాచారం ప్రకారం యూకేలో ‘పెద్ది’ చిత్రం లేటెస్ట్గా 12,500 కి పైగా టికెట్ సేల్స్ జరుపుకుని విడుదలకి ముందే సరికొత్త రికార్డు నమోదు చేసింది. ప్రీ-సేల్స్ ట్రెండ్ చూస్తుంటే ప్రీమియర్స్.. మొదటి రోజు కలెక్షన్ల పరంగా రామ్ చరణ్ కెరీర్లోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలవడం ఖాయమని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Tollywood : ఇరుముడితో మారిన టాలీవుడ్ ట్రెండ్.. కంటెంట్ ఉంటే కనకాభిషేకమే
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లోకి 16 మంది.. ఆ పూర్తి లిస్ట్ ఇదిగో..
- Mandaadi : సముద్రం నడిబొడ్డున షూటింగ్.. 'మండాడి' ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ నిర్వాణ షాకింగ్ కామెంట్స్!
- TFPC: హోరాహోరీగా ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు.. గెలిచింది ఎవరెవరు అంటే ?
తాజావార్తలు
-
Tollywood : ఇరుముడితో మారిన టాలీవుడ్ ట్రెండ్.. కంటెంట్ ఉంటే కనకాభిషేకమే
-
Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లోకి 16 మంది.. ఆ పూర్తి లిస్ట్ ఇదిగో..
-
Mandaadi : సముద్రం నడిబొడ్డున షూటింగ్.. ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ నిర్వాణ షాకింగ్ కామెంట్స్!
-
Tata Tigor Facelift: టియాగోను మర్చిపోయేలా కొత్త టిగోర్.. ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే మార్పులు
-
Madhuri Rathod : మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!