Peddi: ‘పెద్ది’ రన్ టైంపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddi: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా “పెద్ది”. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా రన్ టైంకి సంబంధించి వినిపిస్తున్న ఈ వార్త ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు ఆ వార్త ఏంటంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న భారీ చిత్రం “పెద్ది”. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే యూఎస్ మార్కెట్లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తుండగా, తాజాగా ఈ మూవీ రన్ టైం గురించి ఒక ఆసక్తికర చర్చ మొదలైంది.
గతంలో వచ్చిన ‘యానిమల్’, ‘సలార్’ వంటి భారీ చిత్రాల తరహాలోనే “పెద్ది” కూడా లాంగ్ రన్ టైంతో రాబోతుందని టాక్. ఈ మూవీ నిడివి సుమారుగా 3 గంటలకు పైగానే ఉన్నట్లు సినీ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. డైరెక్టర్ బుచ్చిబాబు సానా కథను ఎంతో ఎమోషనల్‌గా, డీటెయిల్డ్‌గా తెరకెక్కించారని, అందుకే చిత్రం నిడివి అంత వచ్చిందని టాక్. అయితే ఫైనల్ కట్లో ఎడిటర్ నవీన్ నూలి ఏమైనా ట్రిమ్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఫస్ట్ టైం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక గ్రామిణ నేపథ్యంలో ఉన్న స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తుండటంతో, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Peddi: ‘పెద్ది’ రన్ టైంపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్!
-
Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్‌రెడ్డి
-
AP Weather Update: భిన్న వాతావరణం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ఆ జిల్లాల్లో వడగాలులు..
-
Rahul Gandhi: రేపు చెన్నైకు రాహుల్‌గాంధీ.. విజయ్ ప్రమాణస్వీకారానికి హాజరు!
-
Congress MLA Rs 300 Crore Demand: రూ.300 కోట్లు ఇస్తేనే పార్టీలో ఉంటా.. మహిళా ఎమ్మెల్యే డిమాండ్‌తో కాంగ్రెస్‌లో కలకలం..