Peddi: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కాంబినేషన్లో దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న పక్కా మాస్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (PEDDI). జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి నేడు (మే 18న) ముంబైలో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈ లోపే సినిమా ప్రీమియర్స్ (Early Premiers) గురించిన ఒక బ్యాడ్ న్యూస్ మెగా అభిమానులను కాస్త నిరాశకు గురిచేస్తోంది.
ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన తరుణంలో.. జూన్ 4న అఫీషియల్ రిలీజ్ కంటే ఒక రోజు ముందు, అంటే జూన్ 3వ తేదీ సాయంత్రం నుంచే ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రీమియర్ షోస్ ఉంటాయని మేకర్స్ ప్రచార చిత్రాలలో (Posters) అధికారికంగా వేసి వదిలారు. కానీ, గత రెండు మూడు రోజులుగా వస్తున్న ‘పెద్ది’ అఫీషియల్ పోస్టర్లను గమనిస్తే.. అందులో జూన్ 3 ప్రీమియర్స్ ప్రస్తావనను నెమ్మదిగా తొలగిస్తూ వస్తున్నారు. కేవలం జూన్ 4 రిలీజ్ డేట్ మాత్రమే హైలైట్ చేస్తున్నారు. దీనిని బట్టి ఒక్క ఓవర్సీస్ (U.S.A & Rest of World) మినహాయిస్తే.. ఇండియాలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ‘పెద్ది’ ముందస్తు ప్రీమియర్ షోలు ఉండే అవకాశం లేదని స్పష్టమవుతోంది.
Also Read
- Indian Cinema: 'బాహుబలి 2'ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
- Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
- The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
- Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
అయితే మన దగ్గర ప్రీమియర్ షోలను క్యాన్సిల్ చేయడానికి ప్రధాన కారణం ఇటీవల టాలీవుడ్లో టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల పర్మిషన్లపై వచ్చిన కొన్ని వివాదాలే అని ఇండస్ట్రీ టాక్. అంతేకాకుండా, పెద్ద సినిమాలకు ముందే ప్రీమియర్స్ వేయడం వల్ల ఒకవేళ నెగటివ్ టాక్ వస్తే మరుసటి రోజు ఓపెనింగ్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా రిస్క్ తీసుకోకుండా జూన్ 4న డైరెక్ట్ గా మార్నింగ్ షోల నుంచే సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా, ముంబైలో జరగబోయే ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు బుచ్చిబాబు సన లేదా నిర్మాతలు ఈ ప్రీమియర్స్ క్యాన్సిలేషన్‌పై పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
ట్రెండింగ్
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!