Peddi: సాలిడ్ మార్క్ క్రాస్ చేసి.. US మార్కెట్‌లో దుమ్మురేపుతున్న ‘పెద్ది’ .. !

Peddi Ramcharan

Peddi Ramcharan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’. ‘ఉప్పెన’ వంటి భారీ విజయం తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా కావడంతో, ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా యూఎస్ మార్కెట్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఒక సాలిడ్ మార్కును అందుకుంది. ఇంకా ట్రైలర్ కూడా విడుదల కాకుండానే,

కేవలం రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్‌తోనే ఈ చిత్రం అక్కడ 2 లక్షల 50 వేల డాలర్ల ($250K) మార్కును క్రాస్ చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. మొదట్లో బుకింగ్స్ ఓపెన్ చేయగానే మెరుపు వేగంతో దూసుకెళ్లిన ఈ చిత్రం, ఆ తర్వాత కొద్దిగా నెమ్మదించినా ఇప్పుడు మళ్లీ పుంజుకుంది. జూన్ 4న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇంకా పూర్తి స్థాయిలో మొదలవ్వాల్సి ఉంది.ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ భారీ ప్రాజెక్టులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ లెజెండ్ శివ రాజ్‌కుమార్, సీనియర్ నటుడు జగపతి బాబు పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా, టెక్నికల్ పరంగా కూడా హై స్టాండర్డ్స్‌లో ఉండబోతోంది. జూన్ మొదటి వారంలో థియేటర్లలోకి రానున్న ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.