Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?

Peddi Records

Peddi Records

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రం, విడుదలకు ముందే బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది. జూన్ 4న రిలీజ్ అయిన ఈ మల్టీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా, అడ్వాన్స్ బుకింగ్‌లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ప్రముఖ ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్ ‘బుక్ మై షో’ (BookMyShow) లో కేవలం ఒక్క గంట వ్యవధిలోనే 45,000కు పైగా టికెట్లు అమ్ముడవ్వడం ద్వారా, ‘పెద్ది’ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.

దీంతో బుక్ మై షో అవర్లీ ట్రెండింగ్ చరిత్రలో.. గంటకు 40 వేల టికెట్ల మార్కును దాటిన నాలుగో తెలుగు చిత్రంగా ‘పెద్ది’ నిలిచింది. ఇప్పటికే ఈ లిస్ట్‌లో ‘కల్కి 2898 ఏడీ’, ‘సలార్’, ‘పుష్ప 2’ చిత్రాలు ఉండగా.. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి ‘పెద్ది’ కూడా చేరింది. విడుదలకు ముందే ‘పెద్ది’ కి ఈ రేంజ్ బుకింగ్స్ రెస్పాన్స్ రావడంతో, మొదటి రోజు ఈ సినిమా ఈజీగా 100 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

×
×
Ad

ఇప్పటికే కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ చిత్రం 60 కోట్ల మార్క్ క్రాస్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ప్రీమియర్స్ కు మంచి పాజిటివ్ టాక్ రావడంతో, మొదటి రోజు బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. కాబట్టి ‘పెద్ది’ సినిమా చరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచేలా ఉంది.

ఇక బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటించింది. గ్రామీణ నేపథ్యంతో పాటు మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో.. చరణ్ లుక్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ హైలైట్‌గా నిలిచాయి. అలాగే ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.