Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రం, విడుదలకు ముందే బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది. జూన్ 4న రిలీజ్ అయిన ఈ మల్టీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా, అడ్వాన్స్ బుకింగ్‌లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ప్రముఖ ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ‘బుక్ మై షో’ (BookMyShow) లో కేవలం ఒక్క గంట వ్యవధిలోనే 45,000కు పైగా టికెట్లు అమ్ముడవ్వడం ద్వారా, ‘పెద్ది’ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.
దీంతో బుక్ మై షో అవర్లీ ట్రెండింగ్ చరిత్రలో.. గంటకు 40 వేల టికెట్ల మార్కును దాటిన నాలుగో తెలుగు చిత్రంగా ‘పెద్ది’ నిలిచింది. ఇప్పటికే ఈ లిస్ట్‌లో ‘కల్కి 2898 ఏడీ’, ‘సలార్’, ‘పుష్ప 2’ చిత్రాలు ఉండగా.. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి ‘పెద్ది’ కూడా చేరింది. విడుదలకు ముందే ‘పెద్ది’ కి ఈ రేంజ్ బుకింగ్స్ రెస్పాన్స్ రావడంతో, మొదటి రోజు ఈ సినిమా ఈజీగా 100 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read
- Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
- Ameesha Patel: అమీషా పటేల్ ఇంట్లో నగలు చోరీ.. పని మనిషి అరెస్ట్!
- Release Postpone : పెద్ద హీరోల సినిమా అంటే వాయిదా పడాల్సిందేనా?"
- Ram Lakshman Masters: 'ది ప్యారడైజ్' సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
ఇప్పటికే కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ చిత్రం 60 కోట్ల మార్క్ క్రాస్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ప్రీమియర్స్ కు మంచి పాజిటివ్ టాక్ రావడంతో, మొదటి రోజు బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. కాబట్టి ‘పెద్ది’ సినిమా చరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచేలా ఉంది.
ఇక బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి జాన్వి కపూర్ హీరోయిన్గా నటించింది. గ్రామీణ నేపథ్యంతో పాటు మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో.. చరణ్ లుక్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ హైలైట్‌గా నిలిచాయి. అలాగే ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
తాజావార్తలు
-
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
-
Ameesha Patel: అమీషా పటేల్ ఇంట్లో నగలు చోరీ.. పని మనిషి అరెస్ట్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!