Ram Charan: నేషనల్ అవార్డు రేస్‌లో రామ్ చరణ్‌

Ram Charan National Award

Ram Charan National Award

టాలీవుడ్‌లో స్టార్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతోంది. టైర్ వన్ హీరోలు పాన్ ఇండియాలో తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నారు. ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ నేషనల్ అవార్డుని అందుకున్నాడు. కానీ ఈ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి నేషనల్ అవార్డు రేసులో చాలా తక్కువ మంది హీరోలు ఉన్నారు. ‘పెద్ది’ సినిమాలో అత్యుత్తమమైన నటనను ప్రదర్శించినందుకు నేషనల్ అవార్డు రేస్‌లో రామ్ చరణ్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆయన ‘పెద్ది’ సినిమా కోసం విపరీతంగా కష్టపడ్డాడు. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా తన నటనకి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. స్టార్ హీరోలలో ఈ ఇయర్ చాలా తక్కువ మంది తమ సినిమాలను రిలీజ్ చేశారు. అందులో రామ్ చరణ్ చేసిన ‘పెద్ది’ క్యారెక్టర్‌కి నేషనల్ అవార్డు వస్తుందంటూ ఆయన అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యుత్తమమైన నటనను ప్రదర్శించిన వాళ్లకు మాత్రమే నేషనల్ అవార్డు వస్తుంది. ఇతర భాషల హీరోలను పక్కనపెడితే తెలుగు నుంచి రామ్ చరణ్ ఈ రేస్‌లో ముందు వరుసలో ఉన్నాడు. ఇన్ని సంవత్సరాల తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ మాత్రమే ఉత్తమ నటుడు విభాగంలో నేషనల్ అవార్డును అందుకున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోశాడు. రామ్ చరణ్ సైతం ఇప్పుడు నేషనల్ అవార్డును అందుకొని మరోసారి తెలుగు సినిమా స్థాయిని పెంచుతాడా, లేదా అనేది తెలియాల్సి ఉంది. ‘పెద్ది’ సినిమాలో ఆయన వైవిధ్యభరితమైన క్యారెక్టర్‌లో నటించి ప్రతి ఒక్కరినీ ఆకర్షించాడు.

ఒక కమర్షియల్ హీరో అయి ఉండి కాలు లేకుండా నటించడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి నేపథ్యంలో ఆయన చాలా అలవోకగా ఆ క్యారెక్టర్‌ని ఓన్ చేసుకొని, ఎక్కడా రామ్ చరణ్ కనిపించకుండా, ‘పెద్ది’ క్యారెక్టర్ మాత్రమే కనిపించేలా నటించి మెప్పించాడు. అందుకే అతనికి తప్పకుండా నేషనల్ అవార్డు వస్తుందంటూ ఆయన అభిమానులు సైతం సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే రామ్ చరణ్‌కి నేషనల్ అవార్డు వస్తుందా, లేదా అనేది తెలియాలంటే అవార్డుల ప్రకటన వరకు వెయిట్ చేయాల్సిందే.