Ram Charan Body Gaurd : రామ్ చరణ్ బాడీ గార్డుకు బాడీ గార్డులు.. ఇది కదా క్రేజ్ అంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ఎంత ట్రెండ్ అవుతుందో, రామ్ చరణ్ బాడీగార్డ్ కూడా అంతే ట్రెండ్ అవుతున్నాడు. నిజానికి నాలుగేళ్ల క్రితం నుంచే అతను చరణ్‌కు బాడీగార్డ్‌గా కనిపిస్తున్నాడు. కానీ, ఇటీవల వీడియోల్లో కనిపించడంతో అతను ఎవరా అని ఆరా తీయడం ఎక్కువైపోయింది.
అయితే, ఈరోజు విజయవాడలో సాయంత్రం ‘పెద్ది’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ఈ ఈవెంట్ కోసం రామ్ చరణ్ విజయవాడ బయలుదేరి వెళ్లాడు. కానీ, రామ్ చరణ్ కన్నా ముందే సదరు బాడీగార్డ్ వెళ్లి విజయవాడలో ల్యాండ్ అయ్యాడు. అక్కడ అతను బయటకు వస్తున్న క్రమంలో, రామ్ చరణ్ కోసం అక్కడికి వచ్చిన చాలామంది అభిమానులు సదరు బాడీగార్డ్‌తో ఫోటోలు దిగేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ విమానాశ్రయ సిబ్బంది ఆ బాడీగార్డ్‌కే బాడీగార్డులుగా మారి, అతన్ని అక్కడి నుంచి వాహనం ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
ఇక రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈరోజు విజయవాడలో జరుగుతుండగా, దానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం, రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ హాజరుకాబోతున్నారు.
తాజావార్తలు
-
Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
-
Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టాలు తప్పవు!
-
JanaNayagan : జననాయగన్ మరోసారి సెన్సార్.. అదనంగా మరో 41 సెకండ్స్
-
FIFA World Cup: ఫ్రాన్స్‌కు ఫ్యూజులు అవుట్.. ఫైనల్లోకి దూసుకెళ్లిన స్పెయిన్..!
-
AK 64 : శ్రీలీల ఆఫర్ కయాద్ లోహార్ తన్నుకు పోయిందా..?
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!