Kajal Agarwal: ఆ రోజు నేనూ చనిపోవాల్సింది.. కానీ ఏదో అదృశ్య శక్తి నన్ను వెనక్కి లాగింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కమల్ హాసన్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇండియన్ 2’ షూటింగ్ సమయంలో జరిగిన ఘోర ప్రమాదం అప్పట్లో సినీ పరిశ్రమను కుదిపేసింది. ఈ దుర్ఘటన జరిగి ఆరేళ్లు గడుస్తున్నా, ఆ నాటి చేదు జ్ఞాపకాలు తనను ఇంకా వెంటాడుతున్నాయని స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా వెల్లడించారు. ఆ ప్రమాదంలో తానే మొదటగా ప్రాణాలు కోల్పోవాల్సిందని, అయితే ఏదో తెలియని శక్తి తనను కాపాడిందని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. 2020 ఫిబ్రవరిలో చెన్నైలోని ఈవీపీ (EVP) ఫిల్మ్ సిటీలో ‘ఇండియన్ 2’ సినిమాకు సంబంధించిన భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో సుమారు 100 అడుగుల ఎత్తైన భారీ క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ కాజల్ సంచలన విషయాలు పంచుకున్నారు. “ప్రమాదం జరిగిన ప్రదేశానికి నేను అత్యంత సమీపంలోనే మానిటర్ చూస్తూ కూర్చున్నాను. ఒక్కసారిగా అందరూ భయంతో పరుగులు తీయడం గమనించి, ఏం జరుగుతుందో తెలియక నేనూ లేచి పరిగెత్తబోయాను. కానీ, కంగారులో అక్కడే ఉన్న టేబుల్ తగిలి కింద పడిపోయాను. వెనక్కి తిరిగి చూసేసరికి ఆ భారీ క్రేన్ నేరుగా నా మీదకే దూసుకొస్తోంది” అంటూ ఆ భయానక క్షణాలను వివరించారు. ఆ క్షణంలో తనకు చావు కళ్లముందే కనిపించిందని కాజల్ ఆవేదన వ్యక్తం చేశారు. “నేను కింద పడిపోయిన చోటుకు అతి సమీపంలోనే ఆ క్రేన్ నేలకూలింది. సరిగ్గా అదే సెకనులో నన్ను ఎవరో వెనక్కి లాగారు. నన్ను లాగింది ఎవరో ఇప్పటికీ తెలియదు. అంతా రెప్పపాటులో జరిగిపోయింది. నా జీవితంలో నేను చూసిన అత్యంత భయంకరమైన ప్రమాదం ఇదే. నిజానికి ఆ ప్రమాదంలో నేనే మొదట బలవ్వాల్సింది. కానీ ఏదో ఒక అదృశ్య చెయ్యి నన్ను వెనక్కి లాగి కాపాడింది. ఇప్పటికీ నేను ప్రాణాలతో ఉన్నానంటే నమ్మలేకపోతున్నాను” అని కాజల్ భావోద్వేగానికి లోనయ్యారు.
Also Read
ఈ ప్రమాదం జరిగిన మరుసటి రోజే మహాశివరాత్రి కావడంతో ఇంటికి వెళ్లాలని కాజల్ ప్లాన్ చేసుకున్నారట. కానీ, షూటింగ్ సెట్లో ప్రమాదం జరిగిందన్న వార్త తెలియగానే ఆమె కుటుంబ సభ్యులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారని, వెంటనే వారంతా తనను చూసేందుకు చెన్నైకి తరలివచ్చారని ఆమె తెలిపారు. ఆ షాక్ నుంచి తాను ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదని కాజల్ పేర్కొన్నారు. నాటి ఈ దురదృష్టకర ఘటనలో అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ, ఆర్ట్ అసిస్టెంట్ చంద్రన్, ప్రొడక్షన్ అసిస్టెంట్ మధు తమ విలువైన ప్రాణాలను కోల్పోయిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Kajal Agarwal: ఆ రోజు నేనూ చనిపోవాల్సింది.. కానీ ఏదో అదృశ్య శక్తి నన్ను వెనక్కి లాగింది!
-
Giribabu: టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత
-
Sam Pitroda: ‘‘ప్రధాని మోడీ ఫోన్లు ట్యాప్ చేయరు’’.. రాహుల్‌కు భిన్నంగా సామ్ పిట్రోడా కామెంట్స్.!
-
Chandrababu Convoy: సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లోకి కొత్త వాహనాలు.. రూ.1.78 కోట్లతో ఆరు వాహనాలు కొనుగోలు..
-
AP Rain Alert: బంగాళాఖాతంలో మరో తుఫాన్ ముప్పు.. తీవ్ర తుఫాన్‌గా మారనున్న ‘అక్వాన్’..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!