ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ లో దాదాపు దశాబ్ద కాలం నుంచి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తన నటనతో, అద్భుతమైన ఫిజిక్ తో ఎంతోమంది అభిమానుల మనసు దోచుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం పలు బడా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తాజాగా ఈ బ్యూటీ లేటెస్ట్ ఎల్లో బికినీ పిక్ తో నెట్టింట్లో సెగలు పుట్టిస్తోంది. మేకప్ లుక్ లేకుండా సహజ సౌందర్యంతో స్విమ్మింగ్ పూల్ లో కాళ్ళు పెట్టి కూర్చున్న త్రో బ్యాక్ పిక్ ను షేర్ చేసింది ముద్దుగుమ్మ. కుర్రాళ్ళ మతులు పోగెట్టేలా ఉన్న ఈ హాట్ పిక్ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. కాగా ఈ అమ్మడు ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలను లైన్లో పెట్టేసింది.
Read Also : వెస్ట్ వర్జీనియాలో రజినీకాంత్… పిక్స్ వైరల్
హిందీలో మేడే, ఎటాక్, థాంక్స్ గాడ్ చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించింది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. తమిళంలో ఆమె శివ కార్తికేయన్ ‘అయలాన్’, కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ చిత్రాలలో కనిపించనుంది. అయితే ఇన్ని చిత్రాలతో బిజీగా ఉన్న రకుల్ పై ఓ క్రేజీ రూమర్ వచ్చింది. టాలీవుడ్ లో ఆమెకు అసలు అవకాశాలే లేవని ఓ నేషనల్ మీడియాలో కథనం వచ్చింది. దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన రకుల్ “ఇలాంటి వార్తలను చూసినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. సంవత్సరంలో 365 రోజులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నేను సంవత్సరానికి దాదాపు 6 సినిమాలు చేస్తున్నాను. మరిన్ని చిత్రాలను చేయడానికి మీరు డేట్లు సర్దుబాటు చేయగలిగితే దయచేసి నా బృందానికి సహాయం చేయండి” అంటూ ఘాటు రిప్లై ఇచ్చింది.