గతంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు హైదరాబాద్‌లో ఇంటిని గిఫ్ట్ ఇచ్చారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంఘటన తెలిసిందే. అయితే ఈ విషయం మీద ఇప్పటివరకు రకుల్ ప్రీత్ సింగ్ అధికారికంగా స్పందించలేదు. తాజాగా బాలీవుడ్‌లో ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం మీద స్పందించింది.
Also Read:Mega Anil: ఆ స్టేట్ బయలుదేరుతున్న ‘స్టేట్ రౌడీ’
“మీ జీవితంలో ఉన్న ఒక విచిత్రమైన రూమర్ గురించి చెప్పమ”ని అడిగితే, రకుల్ ఈ విషయం గురించి చెప్పుకొచ్చింది. తనకు హైదరాబాద్‌లో ఉన్న ఇంటిని ఎవరో గిఫ్ట్ ఇచ్చారని ప్రచారం జరిగిందని ఆమె తెలిపింది. అయితే, ఆ ఇంటిని కొనుగోలు చేసేందుకు “మా నాన్న పేపర్ వర్క్ అంతా దగ్గరుండి చూసుకున్నారు. ఆయనకు ఎవరో ఈ విషయం చెప్పితే కోపం వచ్చింది.
Also Read:Assam: అస్సాంను ముంచెత్తిన వరదలు.. 132 ఏళ్ల రికార్డ్ బద్ధలు
‘ఇది నా కూతురు సంపాదించి కొనుక్కున్న ఇల్లు. ఇలా మాట్లాడటం ఏంటి? నీవు వాళ్లకు గట్టిగా కౌంటర్ ఇవ్వు’ అని నా మీద సీరియస్ అయ్యారు” అని రకుల్ చెప్పుకొచ్చింది. అయితే, కొన్ని ఉపయోగం లేని పోర్టల్స్ రాసిన వార్తలను ఖండించుకుంటూ వెళ్లేంత సీన్ లేదని రకుల్ తెలిపింది. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన రకుల్, ప్రస్తుతానికి ఎక్కువగా బాలీవుడ్‌లోనే ఫోకస్ చేస్తోంది. బాలీవుడ్ నిర్మాతను వివాహం చేసుకున్న ఆమె, ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది.
