The Rajasaab : రాజాసాబ్ జనవరి 9న రిలీజ్ కన్ఫామ్ చేసేసారుగా?
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజా సాబ్’. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన రాజాసాబ్ ఫస్ట్ గ్లిమ్స్ కు భారీ స్పందన వచ్చింది.
కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై గత కొద్దీ రోజులగా రోజుకొక డేట్ ఫినిపిస్తోంది. వాస్తవంగా ఈ సినిమాను డిసెంబరు 5న రిలీజ్ చేస్తామని గతంలోనే అధికారకంగా ప్రకటించింది నిర్మాణ సంస్థ. కానీ ఇప్పడు ఈ సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ కాకపోవడంతో రిలీజ్ వాయిదా అని పుకార్లు షికార్లు చేసాయి. ఇదిలా ఉండగా ప్రముఖ థియేటర్ చైన్ సంస్థ PVRINOX తమ బుకింగ్స్ యాప్ లో రాజాసాబ్ ను 2026 జనవరి 9 రిలీజ్ అని పోస్టర్ పెట్టేసింది. ఇటివల చిత్ర నిర్మాత పీపుల్స్ మీడియా అధినేత విశ్వ ప్రసాద్ కూడా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతు సౌత్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సంక్రాంతి కానుకగా జనవరిలోనే రిలీజ్ చేయమని కోరారు అని అన్నారు. ఆ విషయంపై ఆలోచిస్తున్నాం అని అన్నారు. ఇప్పుడు PVRINOX కూడా జనవరి 9 అని డేట్ తో సహా పెట్టేసింది. ఈ లెక్కన రాజసాబ్ జనవరి 9నే రిలీజ్ అనేది దాదాపు ఫిక్స్ అనే అనుకోవాలి.
తాజావార్తలు
-
KCR : పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా..? కేసీఆర్ సావాలి అంటున్నారు.. నేను సావను..
-
2026 Kia Syros: కొత్త వేరియంట్లు & ఆటో ఆప్షన్లతో 2026 కియా సైరోస్ లాంచ్.. పూర్తి వివరాలు
-
Justice Swarana Kanta Sharma: మాజీ సీఎంకు హైకోర్టు గట్టి షాక్.. ‘కేజ్రీవాల్ కేసు నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు’
-
KCR: బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా జీవన్‌రెడ్డి.. ప్రకటించిన కేసీఆర్
-
KCR: కేసీఆర్ స్పీచ్.. దద్ధరిల్లిన సభా ప్రాంగణం.. ఉప్పొంగిన ఉత్సాహం..
ట్రెండింగ్
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?