Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ బర్త్‌డే పోస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన జక్కన్న!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prithviraj Sukumaran: మలయాళ స్టార్ హీరో, విలక్షణ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజు సందర్భంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. సాధారణంగా రాజమౌళి ఎవరికైనా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబితే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ ఈసారి ఆయన పెట్టిన పోస్ట్ కేవలం బర్త్‌డే విష్ లా కాకుండా, రాబోయే ప్రాజెక్ట్‌పై భారీ హైప్‌ను క్రియేట్ చేసేలా మారింది. “హ్యాపీ బర్త్‌డే పృథ్వీ! ఈ రోజు నీలోని కుంభని నిద్రలేపడం నాకు ఇష్టం లేదు. ప్రపంచం మీద తనదైన ముద్ర వేయడానికి పుట్టిన ఆ కుంభుడి సత్తా ఏంటో మనందరికీ తెలుసు. #Varanasi కోసం నీలోని ఆ శక్తి మరోసారి బయటకు రావాలని కోరుకుంటున్నాను” అంటూ జక్కన్న తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. రాజమౌళి వాడిన ‘కుంభ’ అనే పదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సలార్ లాంటి సినిమాలో వరదరాజ మన్నార్‌గా తన గంభీరమైన నటనతో మెప్పించిన పృథ్వీరాజ్లో మరో కొత్త కోణాన్ని, ఇంకా చెప్పాలంటే ఒక విధ్వంసకర రౌద్ర రూపాన్ని వారణాసిలో రాజమౌళి ఆవిష్కరించబోతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పురాణ పాత్రల పేర్లను, వాటి గాంభీర్యాన్ని వెండితెరపై ప్రెజెంట్ చేయడంలో జక్కన్న దిట్ట. ఆ లెక్కన చూస్తే, వారణాసిలో ‘కుంభ’ పాత్ర ఏ రేంజ్లో ఉండబోతుందో చూడాలనే ఆసక్తి ఈ ఒక్క ట్వీట్‌తో అభిమానుల్లో ఆసక్తిని అమాంతం పెంచేశారు.
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ – వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా వారణాసి. ఈ చిత్రం ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో విపరీతమైన అంచనాలతో రూపొందుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. ఆయన సరసన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జోనాస్ ‘మందాకిని’ పాత్రలో నటిస్తుండగా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకూమారన్ ‘కుంభ’ అనే పవర్ఫుల్ విలన్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని దుర్గ ఆర్ట్స్ (డా.కె.ఎల్.నారాయణ), షోయింగ్ బిజినెస్ (ఎస్.ఎస్.కార్తికేయ) సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ గ్రహీత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
Also Read
- Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. 'రామాయణ' రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
- Sai Pallavi Saree Look: "మేడం సార్.. మేడం అంతే".. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
- Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్ ఆశలన్నీ ఆ సినిమాలపైనే!
- Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
Happy birthday Prithvi. Didn’t want to awaken the Kumbha within you today.
The Kumbha who is destined to make his mark on the world.
@PrithviOfficial #Varanasi https://t.co/KSO3SXnClI— rajamouli ss (@ssrajamouli) October 16, 2026
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ బర్త్‌డే పోస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన జక్కన్న!
-
India Rice Exports: కేవలం 5 నెలల్లో బియ్యం ఎగుమతులతో రూ.45,739 కోట్లు.. భారత్‌కు భారీ ఆదాయం!
-
Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
ట్రెండింగ్
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..