రాజమౌళి, మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించారు. కొద్దిరోజుల క్రితం ఒక పెద్ద ఈవెంట్ చేసి, దానికి వారణాసి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ప్రకటించడమే కాదు, మహేష్ బాబుకు సంబంధించిన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో పేరు రుద్రాగా ఉంటుంది, కానీ ఇది రామాయణం ఆధారంగా చేసుకున్న సినిమా అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో రాముడి పాత్రతో పాటు హనుమంతుడి పాత్ర కూడా కీలకంగా మారనుంది.
Also Read :Spirit: ప్రభాస్ లుక్ లాక్.. ఇక కాస్కోండి!
రాముడి అంశతో పుట్టే రుద్ర ప్రయాణమే ఈ సినిమా అనే ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో, ఇప్పటికే హనుమంతుడి పాత్రకు ఆయన ఒక తమిళ స్టార్ హీరోని ఒప్పించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు పూర్తయ్యాయని, చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ చేయడం కోసం ఆ వివరాలు బయటకు వెల్లడించకూడదని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే, మరో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అదేమిటంటే, కొద్దీసేపు కనిపించనున్న రాముడి పాత్ర కోసం ఎవరిని తీసుకోబోతున్నారు అనేది.
Also Read : Karthi: డిసెంబర్ 12న అన్నగారు వస్తారు
నిజానికి రాముడి పాత్ర కోసం టాలీవుడ్‌లో ఏదైనా స్టార్ హీరోని ఒప్పించి కనుక తీసుకోగలిగితే, అది సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. రాజమౌళి సినిమాలో రాముడి పాత్ర అంటే, కచ్చితంగా ఎంత పెద్ద హీరో అయినా ‘చేయను’ అని చెప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తారు, కాబట్టి ఆయన ఎవరితో ప్లాన్ చేశారు అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. అయితే, ‘కల్కి’ సినిమాలో చూపించినట్టుగా కృష్ణుడిని కనిపించి కనిపించినట్లుగా, ఇప్పుడు రాముడిని కూడా అలాగే చూపిస్తారేమో అని చర్చ కూడా ఉంది. మరి రాజమౌళి ఆలోచన ఎలా ఉందో, ఆయన ప్లానింగ్ ఎలా ఉందో వేచి చూడాలి.