ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమైంది. ఎప్పుడెప్పుడు సినిమా షూటింగ్ మొదలవుతుందా అని చర్చ అభిమానుల్లో ఉంది. అయితే, తాజాగా సమాచారం మేరకు అభిమానులకు ఒక పండగ లాంటి న్యూస్ బయటకు వచ్చింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రభాస్ లుక్ టెస్ట్ నిన్న ప్రభాస్ నివాసంలో జరిగినట్లుగా తెలుస్తోంది.
టీమ్ ఇప్పటికే మూడు పవర్ ఫుల్ లుక్స్‌ను లాక్ చేసినట్లుగా చెబుతున్నారు. అయితే, సినిమాలో ఆ మొత్తం మూడు లుక్స్ వాడతారా లేక అందులో ఒక లుక్ ఫైనల్ చేసి వాడతారా అనే విషయం మీద ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఇ
Also Read :Karthi: డిసెంబర్ 12న అన్నగారు వస్తారు
క ‘స్పిరిట్’ సినిమాలో హీరోయిన్‌గా మొదట దీపికా పదుకొనే నటించాల్సి ఉంది, కానీ ఆమెను తప్పించినట్లుగా అధికారిక ప్రకటన రావడంతో పాటు తృప్తి డిమ్రి అనే నటిని తీసుకున్నట్లుగా కూడా సందీప్ రెడ్డి వంగా అధికారికంగా ప్రకటించారు. ఇక త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని కూడా ఈ మధ్యకాలంలో ఆయన ప్రకటించారు. డిసెంబర్ నెల నుంచి సినిమా షూటింగ్ మొదలు కాబోతున్నట్లుగా హింట్ ఇచ్చారు. మొత్తం మీద ప్రభాస్ లుక్ కూడా లాక్ కావడంతో, సినిమా షూటింగ్‌కి ఇక అన్ని అడ్డంకులు క్లియర్ అయ్యాయని చెప్పొచ్చు. అయితే, ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ ఉన్న నేపథ్యంలో, ఈ లుక్ మెయింటెనెన్స్ ఎలా పాజిబుల్ అవుతుంది అనే చర్చ కూడా జరుగుతోంది.