Site icon NTV Telugu

Malavika: ప్రభాస్ బాగా మాట్లాడతారు!

Malavika

Malavika

బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ మాళవిక మోహనన్ రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్”తో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ లో మాళవిక స్టన్నింగ్ లుక్స్, బ్యూటిఫుల్ అప్పీయరెన్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. “రాజా సాబ్” టీజర్ కు మాళవిక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. టీజర్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న నేపథ్యంలో మాళవిక మోహనన్ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. “రాజా సాబ్” టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ తో హ్యాపీగా ఫీలవుతున్నట్లు ఆమె తెలిపింది.

Also Read:Nagarjuna : పాన్ ఇండియా సినిమాలు చేయడం చాలా కష్టమైన పని.. కుబేరలో యూనిక్ పాయింట్ ఉంది!

ప్రభాస్ ను ఫస్ట్ టైమ్ సెట్స్ లో కలిసిన సందర్భాన్ని స్పెషల్ మూవ్ మెంట్ గా తాను ఫీలైనట్లు మాళవిక తెలిపింది. ప్రభాస్ ఎంతో గౌరవంగా, స్నేహంగా ఉంటారని, బాగా మాట్లాడతారని ఆమె పేర్కొంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న “రాజా సాబ్” సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం.. ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Exit mobile version