Raj Tarun Ariyana Pregnancy Allegations: రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూనే ఉంది. తనను ప్రేమించి రహస్యంగా వివాహం చేసుకొని పలుసార్లు అబార్షన్ కూడా చేయించాడని రాజ్ తరుణ్ మీద ఆరోపణలు చేసింది. ప్రస్తుతం మాల్వి మల్హోత్రా మాయలో పడి తనను వదిలేశాడని ఆమె ఆరోపిస్తోంది. ఇక ఇప్పుడు తాను రాజ్ తరుణ్ ని వదిలేశానని కూడా ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చి మరోసారి హాట్ టాపిక్ అయింది. ఇక తాజాగా ఆమె లైవ్ లోనే శేఖర్ భాషాని చెప్పుతో కొట్టిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో రాజ్ తరుణ్ కి అరియనాతో అఫైర్ ఉందని లావణ్య ఆరోపించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.
Buddy Movie Review: బడ్డీ రివ్యూ
ఇప్పుడు మరో సంచలన ఆరోపణ కూడా చేసింది. తనకు అబార్షన్ చేయించినట్లే అరియానని కూడా ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ చేయించాడని ఆరోపించినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని శేఖర్ భాషాని ఒక టీవీ యాంకర్ ప్రశ్నించగా ఈ విషయాన్ని అరియనా చెప్పాలి. లావణ్య చెప్పడం ఏంటి? తనకి ఇలా జరిగిందని అరియనా చెబితే నమ్ముతారు గాని లావణ్య ఆరోపిస్తే నమ్ముతారా? అని ప్రశ్నించాడు. లావణ్య నోటికి వచ్చినట్టు మాట్లాడుతోందని లావణ్య వ్యాఖ్యలను ఖండించాల్సిన అవసరం ఉందని శేఖర్ బాషా చెప్పుకొచ్చాడు. అరియనా రాజ్ తరుణ్ కలిసి అనుభవించు రాజా అనే సినిమాలో నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని లావణ్య ఆరోపిస్తోంది. అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనేది స్వయంగా ఆయన చెబితే గాని క్లారిటీ వచ్చే అవకాశం తక్కువే.