Raghava Lawrence : ఆలు లేదు, చూలు లేదు.. పదవి పేరు డిప్యూటీ సీఎం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇళయ దళపతి విజయ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి, తమిళనాడు రాజకీయాల్లో కోలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల జోక్యం ఎక్కువయ్యింది. అంతేకాదు, ఆయనకు అభినందనలు తెలిపేందుకు లేదా పెళ్ళిళ్ళు, పేరంటాలకు పిలిచేందుకు.. ఇలా ఏదో ఒక వంకతో నిత్యం ఎవరో ఒకరు సెక్రటేరియట్ మెట్లు ఎక్కుతూనే ఉంటున్నారు. ‘కమల్ హాసన్’ మొదలుకుని ‘కుష్బూ’, ‘స్నేహ’, ‘సిమ్రాన్’, ‘శింబు’, ‘విశాల్’, డైరెక్టర్ ‘పార్తీబన్’, నటుడు ‘శ్యామ్’ ఇలా అందరూ సీఎం విజయ్ ను కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకోగా, వాళ్లందరికీ సీఎం విజయ్ తన విలువైన సమయాన్ని కూడా కేటాయించారు.
ఇది ఇలా ఉంటే, కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ‘రాఘవ లారెన్స్’ ఒక్క అడుగు ముందుకేసి, తన రాజకీయ అరంగేట్రం గురించి ఇప్పుడు ఈ టైంలో లేవనెత్తి అందరి దృష్టిని ఆకర్షించేశారు. వాస్తవానికి, ‘విజయ్’ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ సీట్ నుంచి రాఘవ లారెన్స్ బరిలోకి దిగుతున్నారు అనే రూమర్‌కి స్పందించేందుకు పబ్లిక్ ముందుకు వచ్చిన ‘రాఘవ లారెన్స్’, తనకు రాజకీయాల పట్ల ఉన్న ఆసక్తిని, అలాగే విజయ్ ‘టీవీకే’ (TVK) పార్టీ పట్ల ఉన్న అభిప్రాయాన్ని చెప్పే క్రమంలోనే కొన్ని పొంతన లేని, అవసరం లేని పోలికలు చేసి వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోయాడు.
Also Read
- Spirit: 'స్పిరిట్'లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
- Varanasi Movie Update: 'వారణాసి'కి రాజమౌళి డెడ్‌లైన్.. పక్కా ప్లాన్ ప్రకారమే!
- Bethlehem Kudumba Unit : 2026 ఓనమ్ విన్నర్‌గా నివిన్ పౌలి.. 'బెత్లేహెమ్ కుటుంబ యూనిట్' బ్లాక్ బస్టర్
- Prabhas Fauji: ‘ఫౌజీ’లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్.. పీక్స్‌కు చేరిన హైప్.. బాక్సాఫీస్ తగలబడిపోద్ది ఇగ!
మరోపక్క ఆయన ఫ్యాన్ పేజీల నుంచి వస్తున్న AI ఫోటోలు సరికొత్త వివాదానికి తెర లేపుతున్నాయి. తాజాగా లారెన్స్ నిర్వహించిన ప్రెస్ మీట్లో.. తాను రాజకీయాల్లోకి రావడం ఖాయం అని, కాకపోతే సొంత పార్టీ పెట్టి రూలింగ్ పార్టీతో పొత్తులో ఉండాలా? లేదా రూలింగ్ పార్టీలోనే చేరి రాజకీయ సేవ చెయ్యాలా? అనే నిర్ణయాన్ని మాత్రం తన ఫ్యాన్స్‌కే వదిలేశాడు. దీంతో ఫ్యాన్స్ ఏకంగా ఆయన్ని డిప్యూటీ సీఎం చైర్లో కూర్చోబెట్టి, విజయ్ పార్టీ కండువాలు కప్పి మరి వారి అభిప్రాయాన్ని చెప్పకనే చెపుతున్నారు. దీంతో ఇప్పుడు ఆ AI పిక్స్ చెన్నై రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
> “సినిమాలు, సాంగ్స్ కొరియోగ్రఫీ తప్ప రాజకీయాల పట్ల ఎటువంటి అవగాహన లేని ఓ స్టార్, తన ఫ్యాన్స్‌ను డిసైడ్ చెయ్యమని ఆప్షన్స్ ఇవ్వడం ఏంటి? వారు AI సాయంతో స్టార్స్‌ను వారికి నచ్చిన పదవుల్లో కూర్చోబెట్టడం ఏంటి? అసలు ఈ రాజకీయాలు ఎటు పోతున్నాయి?” అంటూ కొందరు చెన్నై రాజకీయ మేధావులు లారెన్స్ ఫ్యాన్స్ వరుస పోస్ట్‌లపై మండిపడుతున్నారు.
మరోపక్క లారెన్స్ చేసిన వీధి కుక్కల వ్యాఖ్యలతో పాటు, తరువాత ఆయన ఇచ్చిన వివరణను కూడా తప్పు పడుతూ.. ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్’ లాంటి కల్ట్ క్లాసిక్ కథా రచయిత, డైరెక్టర్ ‘చేరన్’ సైతం సోషల్ మీడియాలో ఖండిస్తూ పోస్ట్ పెట్టారు. దీంతో రానున్న రోజుల్లో తమిళ రాజకీయాల్లో పరిశ్రమకు చెందిన మరిన్ని స్టార్స్ హడావిడే ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Spirit: ‘స్పిరిట్’లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
-
TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
-
Varanasi Movie Update: ‘వారణాసి’కి రాజమౌళి డెడ్‌లైన్.. పక్కా ప్లాన్ ప్రకారమే!
-
Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
ట్రెండింగ్
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!