తెలుగులో బాలకృష్ణతో రెండు సినిమాలు చేసి మన వారికి కూడా బాగానే దగ్గరైంది ముంబై బ్యూటీ రాధికా ఆప్టే. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో రూపొందే సినిమాలు, సిరీస్ లు చేస్తూ విభిన్నమైన బాటలో నడిచే ఈ టాలెంటెడ్ యాక్ట్రస్ కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ ఇటీవల తీసుకుంది. అదే విషయం చెబుతూ సొషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేసింది. ‘జాబ్డ్.. ఫైనల్లీ వ్యాక్సినేషన్’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అయితే, ఆమె వ్యాక్సినేషన్ గురించి చాలా మంది చాలా రకాలుగా స్పందించగా విజయ్ వర్మ కాస్త ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ఆయన రాధికా ఆప్టేతో ‘ఓకే కంప్యూటర్’ అనే వెబ్ సిరీస్ లో కలసి నటించాడు.
విజయ్ వర్మ రాధిక పోస్ట్ కి రిప్లై ఇస్తూ ‘నీ కోసమే ఓ పోస్ట్ పెట్టాను. ఒకసారి నా అకౌంట్లోకి వెళ్లి చూడు’ అని అర్థం వచ్చేలా కామెంట్ చేశాడు. ఇంతకీ, విజయ్ వర్మ ఏం పోస్ట్ చేశాడంటే… అప్పట్లో ఓ కామెడీ సీరియల్ వచ్చేది. ‘సారాభాయ్ వర్సెస్ సారాభాయ్’. ఇది ఇద్దరు అత్తాకోడళ్ల మధ్య సాగే ఫన్నీ టామ్ అండ్ జెర్రీ ఫైట్! కోడలు సాదాసీదా మధ్యతరగతి కుటుంబం నుంచీ వస్తుంది. బాగా డబ్బున్న హై క్లాస్ అత్తా తనకి ఎప్పటికప్పుడు ‘రిచ్ గా, పోష్ గా’ ఎలా ఉండాలో చెబుతూ ఉంటుంది. అలా అత్తా మాయా సారాభాయ్ కోడలు మోనీషా సారాభాయ్ కి వ్యాక్సినేషన్ విషయంలోనూ మిడిల్ క్లాస్ అమ్మాయిలా మాట్లాడ వద్దని చెబుతుంది. దాన్ని మీమ్ గా పోస్ట్ చేశాడు విజయ్ వర్మ!
ఎప్పుడూ హై క్లాస్ గా ఫీలయ్యే అత్త ‘’జాబ్డ్ అనాలి… వ్యాక్సినేటెడ్… బాగా మిడిల్ క్లాస్ గా అనిపిస్తుంది!’’ అంటుందట! విజయ్ వర్మ మీమ్ కి రాధికా ఇంకా స్పందించలేదుగానీ… నెటిజన్స్ అయితే సరదాగా నవ్వుకుంటున్నారు. ముఖ్యంగా, కొన్నేళ్ల క్రితం సూపర్ పాప్యులర్ ‘సారాభాయ్ వర్సెస్ సారాభాయ్’ సీరియల్ చూసిన వాళ్లు!