Raashii Khanna: సిద్ధూ జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘తెలుసు కదా’ విడుదల తేదీ దగ్గర పడుతోంది. నీరజ కోన దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ రాశీ ఖన్నా ప్రేమ, బ్రేకప్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ‘తెలుసు కదా’ లవ్ స్టోరీ కావడంతో ప్రమోషన్స్‌లో రాశీ ఖన్నాను ప్రేమ గురించి ప్రశ్నించగా, ఆమె తన వ్యక్తిగత జీవిత రహస్యాలను పంచుకున్నారు. తాను తన జీవితంలో రెండు సార్లు ప్రేమలో ఉన్నానని రాశీ ఖన్నా వెల్లడించారు. “నేను సినీ రంగంలోకి రాకముందు ఒకసారి, ఆ తర్వాత మరోసారి ప్రేమలో పడ్డాను” అని తెలిపారు. అయితే, ప్రస్తుతం ఆ బంధాలు కొనసాగుతున్నాయా లేదా అనే విషయం మాత్రం తాను ఇప్పుడే చెప్పలేనని అన్నారు.
Read Also: Papikondalu Boat Tourism: పర్యాటకులకు గుడ్‌న్యూస్.. పాపి కొండల విహారయాత్ర మళ్లీ ప్రారంభం..
ప్రేమకథలతో పాటు, బ్రేకప్ అనుభవాల గురించి కూడా రాశీ మాట్లాడారు. తన ‘ఎక్స్’ తో బ్రేకప్ అయిన తర్వాత తన స్నేహితులు అతనిపై ఏదైనా విధంగా రివెంజ్ తీర్చుకోమని సలహా ఇచ్చారని రాశీ తెలిపారు. అయితే, “నేను అలాంటిదాన్ని కాదు. అతని నుంచి నేను దూరం అయి ఉండొచ్చు. కానీ, అతనికి ఏదో చెడు జరగాలని కోరుకునే ఉద్దేశం నాకు లేదు. కర్మ ఎవరినీ వదలదు. నేను తప్పు చేయలేదు, ఇకపై కూడా చేయను. ఆ విషయంలో నేను బాధ పడాల్సిన అవసరం ఏమీ లేదు” అని రాశీ ఖన్నా చెప్పుకొచ్చారు.
Read Also: AP Fake Liquor Case: ఏపీలో కల్తీ మద్యం కేసులో విస్తుబోయే నిజాలు బయటపెడుతున్న ఎక్సైజ్ శాఖ!
సినిమాల్లోకి వచ్చాక రాశీ చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు ఆమె నిజ జీవిత ప్రేమ కథలు, బ్రేకప్స్‌పై మరింత చర్చకు దారి తీశాయి. సిద్ధూ జొన్నలగడ్డ, రాశీ ఖన్నా జంటగా నటించిన ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
