Game Changer Second Single Releases: మెగా అభిమానులతో పాటు సినీ ప్రేమికులందరూ ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సినిమాలలో గేమ్ చేంజర్ కూడా ఒకటి. రాంచరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నారు. సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న నిర్మాత దిల్ రాజు ఇప్పుడు ప్రమోషన్స్ విషయంలో కూడా వేగం పెంచారు..గత కొంతకాలం క్రితమే సాంగ్ 30వ తేదీన రిలీజ్ చేస్తామని చెప్పిన మేకర్స్ ఈరోజు సాంగ్ ప్రోమో ఒకదాన్ని రిలీజ్ చేశారు.
Also Read: Devara : ముందు నుంచీ స్లో పాయిజనే అబ్బా!!!
ఇక ఈ సాంగ్ ప్రోమో అయితే ఆసక్తికరంగా సాగుతోంది. రా మచ్చా మచ్చా రా అంటూ సాగుతున్న ఈ సాంగ్ లో బ్యాక్ గ్రౌండ్ విజువల్స్ కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉండగా రామ్ చరణ్ వేసే స్టెప్పులు కూడా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. శంకర్ సినిమా అంటేనే ఒక విజువల్ గ్రాండియర్. ఆయన పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యేకమైన సెట్లు నిర్మించి కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మరీ ఈ సాంగ్ షూట్ చేయిస్తారు. దానికి తగ్గట్టుగానే విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక ఫుల్ సాంగ్ రిలీజ్ అయితే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామంటున్నారు మెగా అభిమానులు.