Site icon NTV Telugu

Pushpa : గణేష్ మండపం కాదిది.. పుష్ప రాజ్ అడ్డా!!

Pushpa San

Pushpa San

తమిళనాడులోని హొసూరులో పుష్ప వినాయకుడు ‌‌విగ్రహంపై తీవ్ర వివాదం చెలరేగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హిందూ సంఘాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హొసూరులో వినాయక చవితిని పురస్కరించుకుని ప్రజలు ఒక భారీ సెట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సినీ నటుడు అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాలోని గెటప్‌లో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహంలో వినాయకుడు ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేసే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. దీంతో ఇది తీవ్ర చర్చకు దారితీసింది.

Also Read : Peddi : జానీ మాస్టర్ కి రామ్ చరణ్ అవకాశం

వివాదాస్పదమైన ఈ విగ్రహంపై హిందూ సంఘాలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. భారతదేశంలో ప్రజలు ఎంతో పవిత్రంగా పూజించే దేవుడిని, ఒక స్మగ్లర్ గెటప్‌లో చూపించడం సరికాదని వారు ఆరోపిస్తున్నారు. దీనివల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని, అలాంటి విగ్రహాలను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. వినాయకుడిని ఇలాంటి వివాదాస్పదమైన గెటప్‌లో చూపించడంపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు దీనిని వ్యతిరేకిస్తుండగా, మరికొందరు దీనిని ఒక కళాత్మక సృష్టిగా అభివర్ణిస్తున్నారు.

Exit mobile version