పుష్ప -2 వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయింది. తెలుగు రాష్టాల తర్వాత అల్లు అర్జున్ కు భారీ ఫాలోయింగ్ ఉన్న రాష్ట్రం కేరళ. ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అల్లు అర్జున్ కొచ్చి లో ఈవెంట్ కు హాజరుకాగా అభిమానులు అదిరిపోయే రేంజ్ లో స్వాగతం పలికారు. ఇక మాలీవుడ్ లో పుష్ప -2 తెలుగు స్టేట్స్ రేంజ్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. దాదాపు 100 కు పైగా ప్రీమియర్స్, ఫ్యాన్స్ షోస్ ప్రదర్శించారు. ఇక ప్రీమియర్స్ నుండే హౌస్ ఫుల్స్ తో పాటు సూపర్ హిట్ టాక్ కూడా తెచ్చుకుంది.
Also Read : Pushpa 2 : పుష్ప ఓవర్సీస్ వసూళ్లు ఆల్ టైమ్ టాప్ – 3
కేరళలో పుష్ప మొదటి రోజు సేల్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చార్యపరిచాయి. డే – 1 పుష్ప కేరళ వ్యాప్తంగా మొత్తం 2,200 షోస్ గాను రూ. 6.35 కోట్ల గ్రాస్ రాబట్టి ఆల్ టైమ్ నంబర్ -1 గా రికార్డు సృష్టించింది. డబ్బింగ్ సినిమాలో ఇప్పటివరకు రాజమౌళి, ప్రభాస్ ల బాహుబలి -2 రూ. 5.4 కోట్ల గ్రాస్ తో టాప్ -1 లో ఉండగా ఇప్పుడు పుష్ప దాన్ని వెనక్కి నెట్టి నంబర్ -1 గా నిలిచింది. అలాగే కేరళ బిగ్గెస్ట్ ఓపెనింగ్ 2024 సినిమాగా ముమ్మటి నటించిన టర్బో రూ. 6.15 కోట్లు గా ఉంది. మలయాళ మెగాస్టార్ ను సైతం అల్లు అర్జున్ వెనక్కి నెట్టి తన సత్తా ఏపాటిదో చూపించాడు. లాంగ్ రన్ లో బాహుబలి – 2 క్లోజింగ్ కలెక్షన్స్ రూ. 73 కోట్లను అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.