కామెడీ చిత్రాలకు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి గట్టి ఆదరణ లభిస్తోంది. లాజిక్ లేకపోయినప్పటికీ, కామెడీ బాగా కుదిరితే బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలు సాధిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో, పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్గా ‘పురుష:’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. “బ్రహ్మచారి భర్త కావాలని నిర్ణయించుకున్న తర్వాత జీవితం యుద్ధభూమిగా మారుతుంది” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం పట్ల అంచనాలు పెంచేసింది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
బత్తుల సరస్వతి సమర్పణలో, కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా బత్తుల కోటేశ్వరరావు నిర్మాతగా, పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో హీరోగా మారుతున్నాడు .
Vaishnavi Chaitanya: పాపం.. వైష్ణవి మీద పడితే ఏం లాభం?
విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శనివారం నాడు ఈ చిత్రాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో వడ్డవల్లి వెంకటేశ్వరరావు (బుల్లబ్బాయ్) క్లాప్ కొట్టగా, బేబీ ఏముల ధరణి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ‘మళ్లీ రావా’, ‘జెర్సీ’, ‘మసుద’ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన వీరు ఉలవలను ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. తన శిష్యుడి కోసం ప్రముఖ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో మరియు పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం, చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడిగా శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్‌గా కోటి పనిచేస్తున్నారు. సినిమాలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్ కథానాయికలుగా నటిస్తుండగా, వెన్నెల కిషోర్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, వి.టి.వి. గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.