టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న పూరి ఈ సారి హిట్ కొట్టేందుకు పవర్ఫుల్ కథ రెడీ చేశాడని టాక్. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ టబూ, కన్నడ స్టార్ దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మలయాళి భామ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.
Also Read : Sai Pallavi : ఇందుకే కదా సాయి పల్లవి అంటే అంత క్రేజ్
ఈ సినిమాను నేడు పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసారు. ఈ విషయాన్నీ అఫీషియల్ గా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు. నేటి నుండి విజయ్ సేతుపతి అలాగే హీరోయిన్ సంయుక్త మీనన్ పై సీన్స్ షూట్ చేయబోతున్నారు. అందుకు అనుగుణంగా లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేసాడు పూరి. ఈ సినిమాను పూరి కనెక్స్ట్ బ్యానర్ మరియు జేబీ మోషన్ పిచర్స్ అధినేత జెబి నారాయణ నిర్మాణంలో ఛార్మి, పూరి జగన్నాధ్ సంయుక్తంగా నిర్మాణం చేస్తున్నారు. భారీ కాస్టింగ్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి విష్ణు రెడ్డి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘బెగ్గర్’ తో పాటు ‘భవతి బిక్షామ్ దేహి’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నాయి.