పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్”తో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పవన్ అభిమానుల్లో ఫుల్ జోష్ వచ్చింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దాదాపు 5 సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో రెండు సినిమాలు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగా… మరోటి ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ కావాల్సి ఉంది. మరోవైపు దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ‘హరిహర వీరమల్లు’, సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న మలయాళ రీమేక్ షూటింగ్ లో పవన్ ఇప్పటికే పాల్గొన్నాడు. అయితే కరోనా వల్ల సినిమా షూటింగులు ఆగిపోయిన విషయం తెలిసిందే. పవన్ కు కూడా ఇటీవల కరోనా సోకడంతో ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో “హరిహర వీరమల్లు”పై ఓ షాకింగ్ ప్రచారం జరుగుతోంది. పీరియాడికల్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని బడ్జెట్ సమస్యలు వెంటాడుతున్నాయట. ప్రస్తుతం సినిమాకు అనుకున్న దానికంటే భారీగా బడ్జెట్ పెరిగిపోయిందట. నిర్మాత ఏ.ఎం రత్నం ఆ బడ్జెట్ ను సమకూర్చుకుని మళ్ళీ సినిమాను ప్రారంభించేలోపు హరీష్ తో సినిమాను పూర్తి చేయాలనీ పవన్ భావిస్తున్నారట. సంక్రాంతికి “హరిహర వీరమల్లు”ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ అంతకంటే ముందే పవన్-హరీష్ మూవీ రానుంది అంటున్నారు. ఆ తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, బండ్ల గణేష్ నిర్మాణంలో ఓ మూవీని పవన్ చేయాల్సి ఉంది.