NTV Telugu Site icon

Producers : బోర్డర్స్ చెరిపేస్తోన్న స్టార్ ప్రొడ్యూసర్స్.. పక్క ఇండస్ట్రీలో భారీ పెట్టుబడులు

Producers

Producers

సినిమా వాళ్లకు  సౌత్, నార్త్ అనే బేరియర్స్ లేవ్.  అంతా ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీగా మారిపోయింది. నార్త్ ఆడియన్స్  సౌత్ సినిమాలను, డైరెక్టర్లను నెత్తిన పెట్టుకుంటున్నారు. బీటౌన్ భామలు సౌత్ సినిమాల్లో మెరుస్తున్నారు.  అలాగే సౌత్ యాక్టర్స్, డైరెక్టర్స్, టెక్సీషియన్స్ బాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు.  ఇక నిర్మాతలు కూడా ఇదే బాటలో వెళుతున్నారు. సొంత ఇండస్ట్రీని వీడి పొరుగు ఇండస్ట్రీల్లో నిర్మాతలుగా మారుతున్నారు. ఓ చోట పొగొట్టుకున్నదీ మరో చోట పొందాలని సూత్రం బాగా ఫాలో అవుతున్నారు.

Also Read : Trisha : 40 ప్లస్‌లో సత్తా చాటుతున్న ‘త్రిష’

బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్  సౌత్ సినిమా బిగ్గర్ దెన్ బాలీవుడ్‌గా ఛేంజ్ కావడాన్ని ముందుగా గ్రహించి అజిత్‌తో త్రీ మూవీస్ నిర్మించగా వకీల్ సాబ్‌లో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అయ్యాడు. ఇక జవాన్ మూవీతో బాలీవుడ్ బాట పట్టిన  కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ బీటౌన్‌లో తొలిసారిగా తన ప్రొడక్షన్ సంస్థ ఏ ఫర్ యాపిల్‌పై ఓ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. బేబీ జాన్ నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఫుల్ స్వింగ్‌లో ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ ఇటు తెలుగు సినిమానే కాదు  అజిత్‌తో కలిసి గుడ్ బ్యాడీ అగ్లీ చేస్తుండగా  హిందీలో సన్నీడియోల్ తో జాట్‌ను లైన్లో పెట్టింది. ప్రభాస్ ఫ్రెండ్స్ బ్యానర్ యువీ క్రియేషన్స్ కూడా కంగువాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. దిల్ రాజు  విజయ్ దళపతిపై పెట్టుబడి పెట్టాడు. ఇక కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కళైపులి ధాను.. శాండిల్ వుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్‌తో మాక్స్ తీస్తున్నాడు. ఇలా ఓ ఇండస్ట్రీ నిర్మాత.. మరో లాంగ్వేజ్ ప్రాజెక్టులపై పెట్టుబడులు పెడుతు లక్ చేసుకుంటున్నారు.

Show comments