VRK Rao : పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నిర్మాత మనవరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిర్మాత వి.ఆర్. కె. రావు మనవరాలి వివాహ వేడుక ఘనంగా సాగింది. భారత వైమానిక దళ మాజీ కమాండర్, నిర్మాత వి.ఆర్. కె. రావు మనవరాలు హిమశ్రీ వేమూరి, కైలాష్ గోగినేనిల పెళ్లి నియో కన్వెన్షన్లో వైభవంగా జరిగింది. మే ఒకటో తేదీన జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు తరలివచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు. వీఆర్కే రావు కేవలం ఒక సైనికుడిగానే కాకుండా సమాజ సేవకుడిగా, కళాకారుడిగా ఎందరికో ఆదర్శం. 1971 ఇండో-పాక్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి దివంగత ప్రధాని ఇందిరా గాంధీ చేతుల మీదుగా ఉత్తమ కమాండర్ అవార్డు అందుకున్న ఘనత ఆయనది. రిటైర్మెంట్ తర్వాత అజైల్ గ్రూప్ ద్వారా ఏకంగా 32 వేల మందికి ఉపాధి కల్పించారు. బుల్లితెరపై, వెండితెరపై తనదైన ముద్ర వేసిన నిర్మాతగా రావుకి ప్రత్యేక గుర్తింపు ఉంది. వరకట్నం, అవినీతి వంటి సామాజిక రుగ్మతలపై ఆయన తీసిన సందేశాత్మక చిత్రాలు అనేక ప్రతిష్టాత్మక నంది అవార్డులను సాధించాయి. శివాజీ రాజా హీరోగా తెరకెక్కిన ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ చిత్రంతో నిర్మాతగా మరో నందిని అందుకుని అతి తక్కువ కాలంలోనే చిత్రసీమలో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నారు.
Also Read
తాజావార్తలు
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!