Spirit Controversy : ప్రభాస్ సినిమాను కోర్టుకు వెళ్లి ఆపిస్తా: రైతు మహిళా నిర్మాత నర్సమ్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో టైటిల్ వివాదాలు కొత్త కాకపోయినా.. ఒక సామాన్య మహిళా నిర్మాతను, అదీ ఒక రైతును పాన్ ఇండియా సినిమా ‘స్పిరిట్’ లీగల్ నోటీసులు ఏ స్థాయిలో రోడ్డున పడేశాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. రెండూ వేర్వేరు కథలైనా.. కేవలం ‘స్పిరిట్’ అనే పేరు ఉండటం వల్లే తన 50 ఏళ్ల కల, ఆస్తులు ఎలా బుూడిదయ్యాయో చెప్తూ నిర్మాత నర్సమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. తన సినిమా విడుదలను ఆపిన ప్రభాస్ ప్రొడ్యూసర్స్, ఇప్పుడు తన సినిమాను ప్రభాస్ గారే స్వయంగా విడుదల చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహిళా నిర్మాత నర్సమ్మ చిన్నప్పటి నుంచి సినిమా తీయాలనే కలతో.. తనకున్న గొర్రెలు, మేకలు, ఆస్తులు అమ్ముకుని, అప్పులు చేసి ఎంతో కష్టపడి ‘స్పిరిట్ ఇస్ నాట్ వన్’ అనే సినిమాను నిర్మించారు. మే 29న గ్రాండ్‌గా విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని, సెన్సార్ పూర్తి చేసి, ప్రమోషన్లు కూడా పూర్తి చేశారు.
కానీ, సరిగ్గా రిలీజ్ సమయానికి ప్రభాస్ ‘స్పిరిట్’ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ (భూషణ్ కుమార్) నుండి లీగల్ నోటీసులు రావడంతో సినిమా విడుదల ఆగిపోయింది. దీనివల్ల ఊరిలో అప్పు ఇచ్చిన వాళ్లు, ఇవ్వాల్సిన వాళ్లు అందరూ నర్సమ్మను అవమానించడం మొదలుపెట్టారు. “డబ్బులు ఎగ్గొట్టడానికే ప్రభాస్ ప్రొడ్యూసర్స్ నోటీసులు పంపించారంటూ” ఊరిలో తన పరువు తీశారని, డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమాను విడుదల చేయమని చేతులెత్తేయడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయానని ఆమె వాపోయారు. “గత మూడేళ్లుగా మా ‘స్పిరిట్ ఇస్ నాట్ వన్’ సినిమా పేరు మీద ఎన్నో మీడియా ఛానళ్లలో ఇంటర్వ్యూలు ఇచ్చాం, ప్రమోషన్లు చేశాం. అప్పుడు స్పందించని పెద్ద నిర్మాణ సంస్థలు, సరిగ్గా సినిమా థియేటర్లలోకి వచ్చే టైమ్‌కే అభ్యంతరం చెప్పడం వెనుక ఉన్న కుట్ర ఏంటో తెలియాలి. మమ్మల్ని ముందే ప్రేమగా అడిగి ఉంటే.. ప్రభాస్ గారి కోసం ఆ టైటిల్‌ను మేము సంతోషంగా ఇచ్చేవాళ్లం. కానీ, మమ్మల్ని ఎవరూ సంప్రదించకుండా నేరుగా కోర్టు నోటీసులతో చిన్న నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నారు.” అని నిర్మాత నర్సమ్మ పేర్కొన్నారు.
Also Read
- ToxicTheMovie : 'టాక్సిక్' ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం: సౌండ్ బాక్స్‌లు కూలి విద్యార్థులకు గాయాలు
- Taapsee vs Kangana: ‘పెంపకం’ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న కంగనా-తాప్సీ వార్.. ఇన్‌స్టాలో ఫైర్ బ్రాండ్ కౌంటర్!
- Jason Sanjay: విజయ్ బాటలో జాసన్ సంజయ్.. నటుడిగా ఎంట్రీపై ఫస్ట్ టైమ్ క్లారిటీ!
- Zombie Reddy 2: తేజ సజ్జ బర్త్‌డేకు ‘జోంబీ రెడ్డి 2’ బిగ్ సర్ప్రైజ్.. ప్రశాంత్ వర్మ హిట్‌కు సీక్వెల్ రెడీ!
ప్రస్తుత పరిస్థితుల్లో తనకు ఎవరూ అప్పు ఇచ్చే పరిస్థితి లేదని, సినిమాను తాము సొంతంగా విడుదల చేసుకోలేమని నర్సమ్మ స్పష్టం చేశారు. తాము చేసిన తప్పు లేదని, అవసరమైతే న్యాయం కోసం కోర్టుకు వెళ్లి పోరాడతానని చెప్పారు. అయినా న్యాయం జరగకపోతే.. ప్రభాస్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు తాము కూడా కోర్టుకు వెళ్లి ఆ సినిమాను ఆపిస్తామని హెచ్చరించారు. అప్పటికీ కాకపోతే, ప్రభాస్ సినిమా ఆఫీస్ ముందే తన ఫ్యామిలీ అంతా ఏం చేసుకుంటుందో అప్పుడు తెలుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మా సినిమాను ఆపేసిన ప్రభాస్ గారే.. ఇప్పుడు మా సినిమాను విడుదల చేసి మమ్మల్ని ఆదుకోవాలని, హీరో ప్రభాస్ మరియు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వెంటనే ఈ విషయంపై స్పందించి ఒక మహిళా రైతు నిర్మాతకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
ToxicTheMovie : ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం: సౌండ్ బాక్స్‌లు కూలి విద్యార్థులకు గాయాలు
-
Taapsee vs Kangana: ‘పెంపకం’ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న కంగనా-తాప్సీ వార్.. ఇన్‌స్టాలో ఫైర్ బ్రాండ్ కౌంటర్!
-
Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Japan Earthquake: జపాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం.. 20 మందికి గాయాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!