Zombie Reddy 2: తేజ సజ్జ బర్త్‌డేకు ‘జోంబీ రెడ్డి 2’ బిగ్ సర్ప్రైజ్.. ప్రశాంత్ వర్మ హిట్‌కు సీక్వెల్ రెడీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zombie Reddy 2: ‘హనుమాన్’, ‘మిరాయ్’ వంటి భారీ హిట్స్ అందుకున్న యువ హీరో తేజ సజ్జ అభిమానులకు మరో క్రేజీ సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగు సినీ ప్రేక్షకులకు జాంబీ కామెడీకి కొత్త రుచి చూపించిన ‘జోంబీ రెడ్డి’ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతున్నట్లు సమాచారం. తేజ సజ్జ 31వ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు (ఆగస్టు 23) చిత్రబృందం భారీ ప్రకటన చేయబోతున్నట్లు సంకేతాలు ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఆసక్తి ఒక్కసారిగా పెరిగింది. ‘వాళ్లు తిరిగి వస్తున్నారు.. రేపు 10:08కి ప్రళయం మొదలవుతుంది’ అంటూ నిన్న రిలీజ్ చేసిన టీజర్ లైన్ అభిమానుల్లో క్యూరియాసిటీని మరింత పెంచుతోంది.
2021లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘జోంబీ రెడ్డి’ తెలుగు సినిమా చరిత్రలో తొలి పూర్తి స్థాయి జాంబీ కామెడీగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. భయం, నవ్వులు, యాక్షన్‌ను కలిపిన ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటు ఓటీటీలో కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడు అదే ప్రపంచాన్ని మరింత భారీ స్థాయిలో ఫ్రాంచైజీగా విస్తరించే ప్రయత్నంలో భాగంగానే ‘జోంబీ రెడ్డి 2’ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈసారి సినిమా గతంతో పోలిస్తే మరింత పెద్ద స్కేల్లో రూపొందనుంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సీక్వెల్‌కు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించకుండా కొత్త దర్శకుడు బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఈరోజు ఇచ్చే ఆఫీషియల్ ప్రకటనతో పాటు దర్శకుడు, ఇతర వివరాలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది.
మొదటి భాగంలో హైదరాబాద్‌కు చెందిన గేమ్ డిజైనర్ మారియోగా తేజ సజ్జ నటించారు. తన స్నేహితుడి పెళ్లి కోసం రాయలసీమకు వెళ్లిన అతను అనుకోకుండా జాంబీ వైరస్ మధ్య చిక్కుకోవడం, రెండు ప్రత్యర్థి కుటుంబాల మధ్య జరుగుతున్న ఘర్షణలు, గ్రామమంతా జాంబీలతో నిండిపోవడం కథను ఆసక్తికరంగా మార్చాయి. చివర్లో శివాలయంలోని పవిత్ర జలంతో వైరస్‌కు నివారణ లభించడం, గ్రామస్తులను కాపాడడం వంటి అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అదే కథను ఇప్పుడు మరింత విస్తృత ప్రపంచంతో కొనసాగించే అవకాశముందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
‘జోంబీ రెడ్డి’లో ఆనంది, దక్ష నాగార్కర్, కిరీటి దామరాజు, ఆర్జే హేమంత్, గెటప్ శ్రీను, లహరి శారి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆ చిత్రంలోని కామెడీ టైమింగ్, రాయలసీమ బ్యాక్‌డ్రాప్, జాంబీ యాక్షన్ మిక్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చాయి. ఇప్పుడు రెండో భాగంలో పాత పాత్రలు తిరిగి వస్తాయా? లేక కొత్త పాత్రలతో కథ ముందుకు సాగుతుందా? అనే ఆసక్తి కూడా నెలకొంది.
ఇదిలా ఉంటే, తేజ సజ్జ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవల ‘మిరాయ్’తో ప్రేక్షకులను అలరించిన ఆయన, ఆ సినిమా సీక్వెల్‌ను కూడా ప్రకటించారు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి ఒక సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నారు. మొదట ఆ సినిమాను 2027 సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, విడుదల తేదీలో మార్పు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.
ఇలాంటి సమయంలో ‘జోంబీ రెడ్డి 2’ ప్రకటన రావడం తేజ సజ్జ అభిమానులకు డబుల్ ట్రీట్‌గా మారింది. తొలి భాగం తెలుగు జాంబీ సినిమాలకు కొత్త దారిని చూపించగా, ఇప్పుడు రెండో భాగం మరింత భారీ స్థాయిలో వస్తే ఫ్రాంచైజీగా నిలిచే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. మరి ఆగస్టు 23న 10:08 గంటలకు రానున్న ఆఫీషియల్ ప్రకటనలో చిత్రబృందం ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతుందో చూడాలి.
- Tags
- cinema
- Zombie Reddy-2
తాజావార్తలు
-
Smart Phone: 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, 90Hz డిస్ప్లే , 12GB ర్యామ్.. మార్కెట్లోకి కొత్త ఫోన్..
-
Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..