సామాజిక మాధ్యమాల్లో భారీగా యూజర్స్ ఉన్న వాటిల్లో ఇన్‌స్టాగ్రామ్ కూడా ఒకటి. అయితే ఇందులో ఫోటోలు, వీడియోలు లాంటివి పోస్ట్ చేయడమే కాకుండా డబ్బు కూడా సంపాదించొచ్చు. ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న సెలెబ్రిటీలంతా ఇప్పుడు ఈ సోషల్ మీడియా మాధ్యమంలో అదే పనిలో ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ లో భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న స్టార్స్ అంతా తమ ఖాతాలలో పలు యాడ్లను పోస్ట్ చేస్తూ ఇంకా రిచ్ అయిపోతున్నారు. అయితే ఇందులో ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారు అనే విషయాన్నీ తాజాగా “హోపర్ హెచ్ క్యూ” విడుదల చేసింది. “ఇన్‌స్టాగ్రామ్ రిచ్ లిస్ట్-2021” అంటూ వారు రిలీజ్ చేసిన ఈ లిస్ట్ మన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా 27వ స్థానంలో నిలిచారు.
Read Also : భారీ రేటుకు “మేజర్” హిందీ శాటిలైట్ రైట్స్
మన గ్లోబల్ స్టార్ ఒక ఇన్‌స్టా పోస్టుకు రూ.3 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. దీనితో ఇన్‌స్టాగ్రామ్ రిచ్‌లిస్ట్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే భారతీయ నటిగా ప్రియాంక నిలిచింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 64 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 2020లో ప్రియాంక 19వ స్థానంలో ఉండగా… ఇప్పుడది 27వ స్థానానికి పడిపోవడం గమనార్హం. సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు, ఇతర ప్రముఖుల జాబితాలో విరాట్ కోహ్లీ 19వ స్థానంలో నిలిచారు. ఈ క్రీడాకారుడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్టుకు గానూ రూ.5 కోట్లు వసూలు చేస్తున్నాడు. ఆ తరువాత ఈ లిస్ట్ లో స్థానం సంపాదించుకున్న రెండవ భారతీయ స్టార్ ప్రియాంక. ఇక ఈ లిస్ట్ లో ప్రముఖ ఫుట్ బాల్ ఛాంపియన్ క్రిస్టియానో రోనాల్డో మొదటి స్థానంలో నిలవగా, బాలీవుడ్ స్టార్ రాక్ రెండవ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.