Nemali: కన్నప్పలో నెమలిగా ‘ప్రీతి ముకుందన్’ పోస్టర్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే ఈ భారీ ప్రాజెక్టు నుంచి ప్రతీ సోమవారం ఓ కీలక అప్డేట్ వదులుతున్నారు. సినిమాలోని విభిన్న పాత్రలను పోషించిన దిగ్గజ నటీనటుల పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మోహన్ బాబు, మోహన్ లాల్, మధుబాల, శరత్ కుమార్, దేవరాజ్ వంటి వారు పోషించిన పాత్రల పోస్టర్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచిన కన్నప్ప టీం.. తాజాగా మరో బ్యూటిఫుల్ పోస్టర్ వదిలింది.
Bapu : ఆసక్తి రేపుతున్న ‘బాపు’ ఫస్ట్ లుక్
Also Read
- Nana Patekar: "రియల్ హీరో".. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
- Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
- NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట'మాస్' చూపించబోతున్నారు
- Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
ఈ సినిమాలో హీరోయిన్ ప్రీతి ముకుందన్ రోల్ ఎలా ఉండబోతుందో తెలుపుతూ తాజాగా బ్యూటిఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు. కన్నప్పలో ఆమె నెమలిగా కనిపించబోతుంది. అందంలో సహజం, తెగింపులో సాహసం, ప్రేమలో అసాధారణం, భక్తిలో పారవశ్యం, కన్నప్పను సర్వస్వం, చెంచు యువరాణి నెమలి అంటూ తాజాగా వదిలిన ఈ పోస్టర్ పై రాసిన పదాలు ఈ క్యారెక్టర్ పట్ల క్యూరియాసిటీ పెంచుతున్నాయి. విడుదల చేసిన కాసేపట్లోనే ఈ పోస్టర్ వైరల్ గా మారింది. కన్నప్ప చిత్రంలో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లాంటి భారీ తారాగణం నటిస్తుంది. ఎంతో అంకితభావంతో విష్ణు మంచు కన్నప్ప పాత్రను పోషిస్తున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. “కన్నప్ప” సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ధైర్యవంతుడైన యోధుడు శివుని భక్తుడైన కన్నప్ప కథను అద్భుతంగా మలుస్తున్న చిత్ర యూనిట్.. ఏప్రిల్ 25, 2025న ఈ సినిమాను రిలీజ్ చేయబోతోంది.
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!